Hardik Pandya : నటాషా స్టాంకోవిచ్‌తో హార్దిక్ పాండ్యా విడాకులు.. ఇన్‌స్టా పోస్టుతో వెల్ల‌డి..

టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా త‌న భార్య నటాసా స్టాంకోవిక్‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లుగా ప్ర‌క‌టించాడు.

Hardik Pandya : నటాషా స్టాంకోవిచ్‌తో హార్దిక్ పాండ్యా విడాకులు.. ఇన్‌స్టా పోస్టుతో వెల్ల‌డి..

Hardik Pandya Natasa Stankovic divorce confirmed

Updated On : July 18, 2024 / 9:49 PM IST

ఇన్నాళ్లుగా జ‌రుగుతున్న ప్ర‌చార‌మే నిజ‌మైంది. టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా త‌న భార్య నటాసా స్టాంకోవిక్‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లుగా ప్ర‌క‌టించాడు. ఈమేర‌కు సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. నాలుగేళ్ల పాటు కలిసి జీవించిన తరువాత.. నటాషా ఇంకా నేను పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాము. అంటూ రాసుకొచ్చాడు.

మా ఇద్ద‌రి జీవితాల్లో ఇది చాలా క‌ఠిన‌మైన నిర్ణ‌య‌మే అయిన‌ప్ప‌టికి త‌ప్ప‌డం లేద‌న్నాడు. తామిద్ద‌రం విడిపోయినా కూడా కొడుకు ఆగ‌స్త్య‌కు ఎటువంటి లోటు లేకుండా చూకుంటామ‌ని తెలిపారు. ఇలాంటి క‌ఠిన స‌మ‌యంలో అంద‌రూ మా యొక్క ప్రైవ‌సీని గౌర‌వించాల‌ని కోరుతున్న‌ట్లు చెప్పుకొచ్చాడు.

IND vs SL : శ్రీలంక ప‌ర్య‌ట‌న భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. టీ20ల్లో కెప్టెన్‌గా సూర్య‌కుమార్‌, వ‌న్డే జ‌ట్టులో శ్రేయాస్‌కు చోటు.. గంభీర్ మార్క్..

 

View this post on Instagram

 

A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93)

కాగా.. బుధ‌వారం తెల్ల‌వారుజామున త‌న కుమారుడు ఆగ‌స్త్య‌ను తీసుకుని న‌టాషా ముంబై నుంచి సెర్బియాకు వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఇప్పుడు హార్దిక్ త‌మ మ‌ధ్య బంధం ముగిసిందంటూ ప్ర‌క‌టించాడు.
ENG vs WI : వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. తొలి రోజే ఇంగ్లాండ్ వ‌ర‌ల్డ్ రికార్డు..