No Recession For The Indian Economy: భారత్‌లో ఆర్థిక మాంద్యం ఏర్పడే ప్రమాదం లేదు.. ఎందుకంటే..?: గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ 

పరిస్థితులు ఇలాగే కొనసాగి అమెరికా, ఐరోపా సమాఖ్య ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినప్పటికీ ఆ ప్రభావం భారత్ పై పడబోదని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ తెలిపింది. అందుకు కారణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో భారత ఆర్థిక వ్యవస్థ అంతగా ముడిపడిలేదని ఎస్ అండ్ పీ గ్లోబల్ ముఖ్య ఆర్థికవేత్త, మేనేజింగ్ డైరెక్టర్ పాల్ ఎఫ్ గ్రుయెవాల్డ్ మీడియాకు చెప్పారు. భారత్ లో కావాల్సినన్ని విదేశీ మారక నిల్వలు ఉన్నాయని అన్నారు.

No Recession For The Indian Economy: అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం నెలకొనే పరిస్థితులు తలెత్తున్న నేపథ్యంలో భారత్ లో మాత్రం ఆ సమస్య తలెత్తబోదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికా, యూకే ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నం అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ద్రవ్యోల్బణం, జీవనవ్యయం భారీగా పెరిగిపోతోంది. ఇప్పటికే ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో బ్రిటన్ ఐదు నుంచి ఆరో స్థానానికి దిగజారింది. భారత్ ఐదో స్థానానికి చేరుకుంది.

అయితే, పరిస్థితులు ఇలాగే కొనసాగి అమెరికా, ఐరోపా సమాఖ్య ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినప్పటికీ ఆ ప్రభావం భారత్ పై పడబోదని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ తెలిపింది. అందుకు కారణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో భారత ఆర్థిక వ్యవస్థ అంతగా ముడిపడిలేదని ఎస్ అండ్ పీ గ్లోబల్ ముఖ్య ఆర్థికవేత్త, మేనేజింగ్ డైరెక్టర్ పాల్ ఎఫ్ గ్రుయెవాల్డ్ మీడియాకు చెప్పారు.

భారత్ లో కావాల్సినన్ని విదేశీ మారక నిల్వలు ఉన్నాయని అన్నారు. అంతేగాక, భారత్ లోని సంస్థలు అన్ని రకాలుగా సమర్థంగా ఆర్థిక విధానాలతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో భారత ఆర్థిక వ్యవస్థ ఏనాడూ పరిపూర్ణంగా ముడిపడిలేదని అన్నారు. అంతర్జాతీయ విపణిలో స్వతంత్రంగా వ్యవహరిస్తోందని చెప్పారు.

ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న అమెరికా మాంద్యంగా దిశగా వెళ్తుందని అన్నారు. 40 ఏళ్లలో ఎన్నడూలేనంత ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోందని తెలిపారు. అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారుకునే ప్రమాదం 50 శాతంగా ఉందని తాము భావిస్తున్నట్లు చెప్పారు.

Gehlot asks VP Dhankhar: ‘టఫ్ లేడీ మమతా బెనర్జీ ఆ ఎన్నికలకు దూరంగా ఉండేలా ఏ మ్యాజిక్ చేశారు?’ అంటూ ఉప రాష్ట్రపతిని ప్రశ్నించిన సీఎం గహ్లోత్

ట్రెండింగ్ వార్తలు