Electric Tipper: హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ టిప్పర్

ఎలక్ట్రిక్ టూ వీలర్స్, ఎలక్ట్రిక్ కార్లు ధాటి ఎలక్ట్రిక్ టిప్పర్ల వరకూ చేరింది టెక్నాలజీ. పూర్తిగా 6x4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్ రెడీ చేసేసింది ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్.

Electric Tipper: ఎలక్ట్రిక్ టూ వీలర్స్, ఎలక్ట్రిక్ కార్లు ధాటి ఎలక్ట్రిక్ టిప్పర్ల వరకూ చేరింది టెక్నాలజీ. పూర్తిగా 6×4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్ రెడీ చేసేసింది ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ కంపెనీ. ఎలక్ట్రిక్ బస్సుల ప్రొడక్షన్‌లో నిమగ్నమై ఉన్న ఎంఈఐఎల్‌ గ్రూపు సంస్థ- ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ విద్యుత్తు ట్రక్కుల విభాగంలోకి అడుగుపెట్టనుంది. ఇందులో భాగంగానేటిప్పర్‌ను రూపొందించింది.

మరికొద్ది రోజుల్లో దీన్ని ఇండియన్ మార్కెట్ లోకి విడుదల చేస్తామని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ టిప్పర్‌పై టెస్టులు నిర్వహిస్తున్నట్లు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ స్పష్టం చేసింది. ఇండియాలో ఇదే మొదటి ఎలక్ట్రిక్ టిప్పర్‌ అవుతుందని పేర్కొంది. ఒలెక్ట్రా హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్‌ను ఒకసారి ఛార్జ్‌ చేస్తే 220 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని, ఘాట్‌ రోడ్లను సైతం సునాయాసంగా ఎక్కగలదని వివరించింది.

టెస్టింగ్ తర్వాత .. హైదరాబాద్‌ శివార్లలో త్వరలో ఏర్పాటు చేయనున్న కొత్త యూనిట్లో ఈ ఎలక్ట్రిక్‌ టిప్పర్‌ ఉత్పత్తిని మొదలుపెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ సీఎండీ కేవీ ప్రదీప్‌ మాట్లాడుతూ త్వరలో విపణిలో విడుదల చేయనున్న విద్యుత్తు టిప్పర్‌కు బోలెడు ప్రత్యేకతలు ఉన్నాయని స్పష్టం చేశారు. విద్యుత్తు బస్సుల విభాగంలో దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతున్నామని వ్యక్తం చేశారు.

Read Also: 20 ఎలక్ట్రిక్ స్కూటర్లు దగ్ధం, మూడు వారాల్లో ఐదో ఘటన

దేశంలోనే తొలిసారిగా ఎలక్ట్రిక్ విభాగంలో హెవీ డ్యూటీ టిప్పర్‌ను ఆవిష్కరించినట్లు వివరించారు. పెట్రోలు- డీజిల్‌ ధరలు గణనీయంగా పెరిగిపోయిన తరుణంలో విద్యుత్ వాణిజ్య వాహనాలు వినియోగదార్లకు అనుకూలంగా మారతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు