Shamshabad : రూ.50 లక్షల్లో డబుల్ బెడ్ రూమ్ ప్లాట్.. శంషాబాద్‌ వైపే భవిష్యత్తు రియల్ ఎస్టేట్

హైదరాబాద్ లో ఇళ్ల ధరలు ఎక్కువగా ఉండటంతో చాలామంది ఉద్యోగులు, మధ్య తరగతి వాళ్లు శంషాబాద్ వైపు చూస్తున్నారు. Shamshabad

Shamshabad Real Estate

Shamshabad Real Estate : ఓవైపు బెంగళూరు జాతీయ రహదారి. మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయం. ఇంకోవైపు ఐటీ హబ్. ఇక ఇప్పుడు ఎయిర్ పోర్టు, మెట్రో ప్రాజెక్ట్. ఓ ప్రాంతం అభివృద్ధికి ఇంతకంటే ఇంకేం కావాలి? రియల్ రంగం భవిష్యత్తు అంతా ఇక శంషాబాద్ వైపే అంటున్నారు రియాల్టీ నిపుణులు. 111 జీవో ఉపసంహరణతో రానున్న రోజుల్లో శంషాబాద్.. భారీ నివాస, కార్యాలయ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారనుందని అంచనా వేస్తున్నారు.

శంషాబాద్ వైపు రియల్ పరుగులు పెడుతోంది. రవాణ, మౌలిక వసతుల్లో శంషాబాద్ నెంబర్ వన్ గా ఉంది. దాంతో మధ్య తరగతి వారి చూపంతా శంషాబాద్ వైపే ఉంది. రూ.50 లక్షల్లో డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ సొంతం చేసుకోవచ్చు. నివాస ప్రాజెక్టులకు కేరాఫ్ అడ్రస్ గా శంషాబాద్ మారింది.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. గ్రేటర్ సిటీ నలువైపులా భారీ నివాస, కార్యాలయ భవన ప్రాజెక్టులు వెలుస్తున్నాయి. నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో వందల సంఖ్యలో నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే, హైదరాబాద్ లో మిగతా ప్రాంతాలతో పోలిస్తే పశ్చిమం వైపు నిర్మాణ రంగం జోరు మీదుంది. ఇందుకు ఐటీ రంగమే కారణం అని చెప్పొచ్చు. ఇప్పుడు శంషాబాద్ కూడా పోటీ కాబోతోందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక భవిష్యత్తు రియల్ ఎస్టేట్ అంతా శంషాబాద్ వైపే అని చెబుతున్నారు.(Shamshabad)

Ultra Premium Gated Community : ఒక్కో ప్లాట్ ధర రూ.6 కోట్ల నుంచి రూ.30 కోట్లు.. అయినా తగ్గేదేలే అంటున్న జనం, అల్ట్రా ప్రీమియం అపార్ట్‌మెంట్స్‌కు ఎందుకంత క్రేజ్ అంటే..

హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో ఒకటైన శంషాబాద్ కు అన్నీ అనుకూలంగా ఉన్నాయని చెప్పాలి. ప్రధానంగా శంషాబాద్ ను ఆనుకుని అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం బాగా కలిసి వస్తోంది. అంతేకాదు శంషాబాద్ మీదుగానే ఔటర్ రింగ్ రోడ్ వెళ్తోంది. ఇక, హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపైనే శంషాబాద్ ఉండటం మరో ప్లస్ పాయింట్. శంషాబాద్ కు కేవలం 15 నిమిషాల వ్యవధిలో శ్రీశైలం రహదారి ఉంది. ఇక హైదరాబాద్ ఐటీ హబ్ శంషాబాద్ కు కూతవేటు దూరంలోనే ఉంది. ఇప్పుడు రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రో ప్రాజెక్ట్ రాబోతోంది. ఓ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇంతకన్నా ఇంకేం కావాలి. ఇక, శంషాబాద్ మున్సిపాలిటీగా ఏర్పడటంతో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు అవుతున్నాయి.

హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల్లో ఇళ్ల ధరలు ఎక్కువగా ఉండటంతో చాలామంది ఉద్యోగులు, మధ్య తరగతి వాళ్లు శంషాబాద్ వైపు చూస్తున్నారు. ప్రధానంగా ఐటీ హబ్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు శంషాబాద్ సమీపంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డుతో కనెక్టివిటీ ఉండటం వంటికి అట్రాక్ట్ చేస్తున్నాయి. ఐటీ హబ్ కు సమీపంలో ఇళ్లు కొనాలంటే కోటి రూపాయలు ఆపైనే ఖర్చు చేయాల్సిందే.

అదే శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ 50లక్షల నుంచి దొరుకుతుంది. శంషాబాద్ దాటి మరికాస్త ముందుకు కొత్తూరు సమీపంలో అయితే రూ.40లక్షలకే డబుల్ బెడ్ రూమ్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. అందుకే, చాలామంది ఐటీ ఉద్యోగులతో పాటు సొంతింటి కలను సాకారం చేసుకోవాలని అనుకుంటున్న మధ్య తరగతి వారు శంషాబాద్ వైపు చూస్తున్నారు.(Shamshabad)

Also Read..Home Construction : ఇలా చేస్తే.. ఇంటి నిర్మాణ ఖర్చులు భారీగా తగ్గించుకోవచ్చు..!

ఇప్పుడిప్పుడే శంషాబాద్ వైపు నివాస ప్రాజెక్టులు మొదలవుతున్నాయి. మొన్న శంషాబాద్ సమీపంలోని బుద్వేల్ లో హెచ్ఎండీఏ భూముల వేలంతో రియల్ ఎస్టేట్ స్పీడ్ అందుకుంది. ఇక్కడ ప్రస్తుతం 25వరకు అపార్ట్ మెంట్స్, విల్లా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఇక ప్రభుత్వం 111 జీవో ఉపసంహరించుకున్న నేపథ్యంలో త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులు మొదలు పెట్టేందుకు నిర్మాణ రంగ సంస్థలు సిద్ధమవుతున్నాయి.

ప్రస్తుతం అపార్ట్ మెంట్ లో చదరపు అడుగు రూ.4వేల నుంచి రూ.6వేల వరకు ధర పలుకుతుండగా.. విల్లా అయితే రూ.2 కోట్ల నుంచి రూ.4కోట్ల వరకు ధరలు ఉన్నాయి. మెల్లమెల్లగా శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇళ్లకు డిమాండ్ పెరుగుతూ ఉండటంతో రానున్న రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉందని రియల్ రంగ నిపుణులు అంటున్నారు. అందుకే, శంషాబాద్ వైపు నివాసం ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్న వారు ఓ నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు