Reliance Jio offers free prepaid plan for six months to iPhone 15 buyers
Reliance Jio Offers : భారత మార్కెట్లో ఐఫోన్ కొనుగోలుదారులకు (iPhone Buyers) ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. రిలయన్స్ డిజిటల్, జియోమార్ట్ (JioMart) లేదా రిలయన్స్ రిటైల్ స్టోర్ (Reliance Retail Store) నుంచి కొనుగోలు చేసిన ‘Make in India’ ఐఫోన్ 15పై వర్తించే ఆకర్షణీయమైన ప్లాన్లను ప్రకటించింది.
రిలయన్స్ రిటైల్ లేదా ఆన్లైన్ స్టోర్ల నుంచి (Apple iPhone 15)ని కొనుగోలు చేసే కస్టమర్లు 6 నెలల పాటు నెలకు రూ. 399 కాంప్లిమెంటరీ ప్లాన్‌కు అర్హులు (3GB/రోజు, అన్లిమిటెడ్వాయిస్, 100 SMS/రోజు). దీని ఫలితంగా రూ. 2,394 విలువైన కాంప్లిమెంటరీ బెనిఫిట్స్ అందిస్తాయి. రూ. 149 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్లపై కొత్త ప్రీపెయిడ్ యాక్టివేషన్‌లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
జియో కాంప్లిమెంటరీ ఆఫర్ పొందాలంటే? :
ఈ ఆఫర్‌ను పొందేందుకు జియోయేతర కస్టమర్లు కొత్త సిమ్ తీసుకోవచ్చు లేదా (MNP) చేయవచ్చు. ఈ కొత్త ఐఫోన్ 15 డివైజ్‌లో కొత్త ప్రీపెయిడ్ జియో సిమ్‌ని చొప్పించిన తర్వాత మొబైల్ కనెక్షన్‌పై 72 గంటలలోపు కాంప్లిమెంటరీ ఆఫర్ ఆటో క్రెడిట్ అవుతుంది. జియో (iPhone 15) ఆఫర్ కింద జియో నంబర్‌కు క్రెడిట్ చేసిన తర్వాత అర్హతగల కస్టమర్లకు SMS/ఇ-మెయిల్ ద్వారా తెలియజేస్తుంది.
Reliance Jio offers free prepaid plan for six months to iPhone 15 buyers
జియో కాంప్లిమెంటరీ ప్లాన్ (iPhone 15) డివైజ్‌లలో మాత్రమే పనిచేస్తుంది. ‘మేక్ ఇన్ ఇండియా’ ఐఫోన్ 15తో పాటు స్థానికంగా అసెంబుల్ చేసిన ఐఫోన్ 15 ప్లస్‌ను భారతీయ యూజర్లకు ఆపిల్ అందిస్తోంది. ఈసారి ఐఫోన్ 15 సిరీస్‌పై ప్రీ-ఆర్డర్లలో దాదాపు 50 శాతం పెరిగింది. ఆపిల్ గత ఏడాదిలో ఐఫోన్ 14 సిరీస్ నుంచి ప్రీ-ఆర్డర్లను రెట్టింపు చేస్తోంది.
ఆపిల్ ఐఫోన్ 15 ఆఫర్లు.. :
రిలయన్స్ జియో అధికారిక ఛానెల్ నుంచి కొత్త ఐఫోన్ 15 కొనుగోలుపై కస్టమర్లను ఆకర్షించడానికి లేటెస్ట్ ఆఫర్లను ప్రకటించింది. iPhone 15 సిరీస్‌ని కొత్త Apple Watch, AirPods Proతో పాటు సెప్టెంబర్ 12న ప్రకటించింది. ఈ కొత్త ఐఫోన్ మోడల్‌లు ఇప్పుడు వివిధ ఆఫ్‌లైన్, ఆన్లైన్ ఛానెల్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 15 వెనిలా మోడల్‌ను రిలయన్స్ డిజిటల్, జియోమార్ట్, రిలయన్స్ ఆఫ్‌లైన్ అవుట్లెట్ల నుంచి కొనుగోలు చేయవచ్చు.
Reliance Jio offers free prepaid plan for six months to iPhone 15 buyers
మీకు జియో SIM లేకపోతే, ఈ బెనిఫిట్స్ పొందడానికి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) ద్వారా మీ మొబైల్ నంబర్‌ను పోర్ట్ చేయవచ్చు లేదా కొత్త SIMని కొనుగోలు చేయవచ్చు. iPhone 15 మోడల్లకు ఈ ఆఫర్ మాత్రమే వర్తిస్తుంది. ధర విషయానికొస్తే.. కొత్త ఐఫోన్ 15 భారత మార్కెట్లో రూ.79,900 నుంచి ప్రారంభమవుతుంది.