Svitch Bike Experience Centre : హైదరాబాద్‌‌కు ‘స్విచ్ బైక్’ రెండో ఎక్స్‌పీరియన్స్ సెంటర్ వచ్చేసిందోచ్..!

Svitch Bike Experience Centre : మాదాపూర్‌లోని SG ఆటోమోటివ్స్ రెండో ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. వినియోగదారులను స్వయంగా నడిపే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. 

Svitch Bike opens second experience centre in Madhapur

Svitch Bike Experience Centre : ప్రముఖ ఓఈఎమ్‌ (OEM) ఎన్విరాన్‌మెంటల్‌ ఫ్రెండ్లీ (పర్యావరణహిత) ప్రీమియం ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ సైకిళ్ల పరిశ్రమలో అగ్రగామి అయిన ‘స్విచ్ బైక్’ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా కంపెనీ రెండో ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. గుజరాత్‌కు చెందిన ఈవీ బ్రాండ్ ‘స్విచ్ బైక్’ మాదాపూర్‌లోని SG ఆటోమోటివ్స్ నుంచి తమ కార్యకలాపాలను క్రమంగా విస్తరిస్తోంది. ఈ కొత్త స్టోర్‌ వేదికగా వినియోగదారులు స్విచ్ బైక్‌ను స్వయంగా నడిపే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది.

బేగంపేటలో MV ఆటోమొబైల్స్‌ను విజయవంతంగా ప్రారంభించిన రెండన్నర నెలల్లోనే ఈ ఎక్స్‌పీరియన్స్ షోరూంను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్‌లో కొత్తగా ప్రారంభించిన SG ఆటోమోటివ్స్ స్విచ్ బైక్ ఎక్స్‌పీరియన్స్ షోరూమ్, హైటెక్ సిటీతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఎలక్ట్రిక్‌ వాహాన (EV) స్వయంగా టెస్టింగ్ చేసుకోవచ్చు. స్విచ్ బైక్ ఆధ్వర్యంలోని ఎలక్ట్రిక్ సైకిళ్లను ఔత్సాహికులు ప్రత్యక్షంగా టెస్టింగ్ చేయడమే కాకుండా ఫాస్ట్‌ డెలివరీ కోసం కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

Read Also : Reliance Jio Phone 5G : అతి చౌకైన ధరకే జియో 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవేనా? లాంచ్ డేట్ ఎప్పుడంటే?

ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా స్విచ్ బైక్ వ్యవస్థాపకులు, ఎమ్‌డీ రాజ్‌కుమార్ పటేల్ మాట్లాడుతూ.. ‘దేశంలోని ప్రతి ఇంటికి స్విచ్ బైక్‌ను డెలివరీ చేసేందుకు అనుకూలంగా భారత్ అంతటా నూతన షోరూంలను ఏర్పాటు చేయనున్నాం. ప్రధానంగా భారత్‌లో హైదరాబాద్‌ సిటీ ఈవీ హబ్‌గా అవతరిస్తోంది. స్విచ్ బైక్‌పై నగర ప్రజల మద్దతు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ పరిణామం సంస్థ ప్రయాణానికి అభివృద్ధి సూచికని వ్యవస్థాపకుడిగా నమ్ముతున్నాను’ అని పేర్కొన్నారు.

Svitch Bike opens second experience centre in Madhapur

స్విచ్ బైక్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్ అనేది హై-ఎండ్ ఎక్స్‌పీరియన్స్ షోరూమ్ కన్నా ఉన్నతమైనదిగా తెలిపారు. సైక్లింగ్ కమ్యూనిటీని స్థిరమైన వేదికగా పనిచేస్తుందని చెప్పారు. SG ఆటోమోటివ్స్‌కు అధిపతిగా గణపత్ సర్వీ, పీ.కిషన్ గోపాల్ హైదరాబాద్‌లో స్విచ్ బైక్‌లు అందించే ప్రత్యేక డీలర్‌లుగానూ సేవలందిస్తోంది. క్వాలిటీ విషయంలో నిబద్దతతో ముందుకు సాగుతున్న ‘స్విచ్ బైక్‌’ ఎలక్ట్రిక్ సైకిల్ పరిశ్రమలో అగ్రగామిగా గుర్తింపు పొందిందని, భవిష్యత్‌ రవాణా సేవలన్నీ ఎలక్ట్రిక్ వాహానాలపైనే ఆధారపడతాయని నమ్ముతున్నామని స్విచ్ బైక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ చింతన్ ఖత్రీ తెలిపారు.

Read Also : iPhone 14 Plus Price : అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. ఐఫోన్ 14 ప్లస్ ధర తగ్గిందోచ్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

ట్రెండింగ్ వార్తలు