Tata Nexon EV: వావ్! ఈ SUVకారులో రూ. 580కే 1000కి.మీలు ప్రయాణించొచ్చు

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిపోతున్న పరిస్థితి.

Tata Nexon EV: భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిపోతున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించేవారు తక్కువ.

కానీ, ప్రస్తుత పరిస్థితిలో డబ్బును ఆదా చేసుకోవాలంటే మాత్రం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చెయ్యాలని సూచిస్తున్నారు. అయితే ఎలక్ట్రిక్ కార్ల ధర కాస్త ఎక్కువే. ఉదాహరణకు టాటా నెక్సాన్ EV.. ఈ కారును నడపడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా? కేవలం 580 రూపాయలతో ఈ కారు 1000కిమీలు నడుస్తుంది.

టాటా నెక్సాన్ ధర..స్పెసిఫికేషన్‌లు:
టాటా నెక్సాన్ EV ధర రూ.14,24,000 నుండి ప్రారంభమవుతుంది. ఈ కారు 9.9 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు 245 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే పర్మనెంట్ మాగ్నెట్ AC మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ కారు IP67 సర్టిఫైడ్ 30.2 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది.

టాటా నెక్సాన్ EV డ్రైవ్ రేంజ్:
ఫాస్ట్ ఛార్జర్‌తో, దీనిని 1 గంటలో 80% వరకు ఛార్జ్ చేయవచ్చు. మీరు హోమ్ ఛార్జర్‌ని ఉపయోగిస్తే, బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 8 గంటలు పడుతుంది. పూర్తి ఛార్జ్‌పై, టాటా నెక్సాన్ EV 312 కిమీల వరకు నడుస్తుంది. ఈ SUV 30.2 kwh బ్యాటరీతో పనిచేస్తుంది.

బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 30.2 యూనిట్లు ఖర్చు అవుతుంది అంటే రూ. 6/యూనిట్ విద్యుత్ రేటును పరిగణనలోకి తీసుకుంటే, ఒకసారి పూర్తి ఛార్జీకి రూ. 181ఖర్చు అవుతుంది. 312 కి.మీ. ఈ విధంగా కిలోమీటరుకు దీని ధర దాదాపు 58 పైసలు. కాబట్టి కారు 1000 కి.మీ నడపడానికి రూ.580 విద్యుత్ ఖర్చవుతుంది.

ట్రెండింగ్ వార్తలు