Gold Rate : తగ్గిన బంగారం ధర.. కారణం ఏమిటో తెలుసా? తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతంటే..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో

Gold And Silver Price : ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలు గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే, బుధవారం మరోసారి బంగారం ధర భారీగా పెరిగింది. తాజాగా గురువారం మళ్లీ బంగారం ధర తగ్గింది. 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారంపై రూ. 380 తగ్గింది. వారం రోజులుగా ధరలు తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణం.. పశ్చిమాసియాలో ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తగ్గుముఖం పట్టడంతోపాటు.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరికొంత కాలంపాటు అధిక వడ్డీ రేట్లను కొనసాగించే అవకాశాలు కనిపిస్తుండటంతో అంతర్జాతీయంగా పసిడి ధర తగ్గినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు వెండిధరసైతం తగ్గింది. కిలో వెండిపై రూ. 400 తగ్గింది. దీంతో నాలుగు రోజులుగా కిలో వెండిపై రూ.4వేలు తగ్గినట్లయింది.

 

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,250 వద్దకు చేరుకోగా.. 10గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,270 వద్దకు చేరింది.

 

  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,400 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,420.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,250 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,270.
    చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.67,100 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.73,200.

 

  • తగ్గిన వెండి ధర ..
    దేశ వ్యాప్తంగా వెండి ధర తగ్గింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.86,000 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 86,000. కోల్ కత్తా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.82,500 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 82,400 వద్ద కొనసాగుతుంది.

 

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.

 

ట్రెండింగ్ వార్తలు