IQOO Z10 Lite 5G : ఈ ఐక్యూ 5G ఫోన్ పై కిర్రాక్ డిస్కౌంట్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొంటారంతే..!

IQOO Z10 Lite 5G : ఐక్యూ Z10 లైట్ 5G ఫోన్ ధర తగ్గింది.. ఏకంగా 20శాతం డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

IQOO Z10 Lite 5G : ఈ ఐక్యూ 5G ఫోన్ పై కిర్రాక్ డిస్కౌంట్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొంటారంతే..!

IQOO Z10 Lite 5G

Updated On : September 7, 2025 / 6:21 PM IST

IQOO Z10 Lite 5G : కొత్త ఐక్యూ ఫోన్ కొంటున్నారా? భారీ బ్యాటరీతో ఐక్యూ Z10 లైట్ 5G ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ 5G ఫోన్ లాంగ్ బ్యాటరీ లైఫ్ మాత్రమే (IQOO Z10 Lite 5G) కాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం అద్భుతంగా ఉపయోగపడుతుంది. అత్యుత్తుమ పర్ఫార్మెన్స్ అందించే ఈ మీడియాటెక్ డైమన్షిటీ ప్రాసెసర్, అందమైన కెమెరా సెటప్ కూడా కలిగి ఉంది. IP64 రేటింగ్, మిలిటరీ-గ్రేడ్ రెసిస్టెన్స్‌తో వస్తుంది.

సెప్టెంబర్ 2025లో ఫ్లిప్‌కార్ట్ ఎర్లీ బర్డ్ అమ్మకాలలో 20శాతం తగ్గింపుతో ఐక్యూ Z10 లైట్ 5G ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. మీరు రూ. 15 వేల బడ్జెట్ లోపు బెస్ట్ బ్యాటరీ కలిగిన ఫోన్ కోసం చూస్తుంటే ఐక్యూ Z10 లైట్ 5G ఫోన్ కొనుగోలు చేయొచ్చు.

ఐక్యూ Z10 లైట్ 5G ఫోన్ ఫీచర్లు :
ఐక్యూ Z10 లైట్ 5G ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 6.74 అంగుళాల HD ప్లస్ LCD డిస్ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ వరకు గరిష్ట ప్రకాశంతో వస్తుంది. మీరు ఈ ఫోన్‌ను నేరుగా సూర్యకాంతిలో కూడా సులభంగా ఉపయోగించవచ్చు. కచ్చితమైన కలర్ ఆప్షన్లు, కాంట్రాస్ట్‌తో అద్భుతమైన వ్యూ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఈ ఐక్యూ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది.

Read Also : Aadhaar Card : మీ ఆధార్ కార్డు ఒరిజినల్ లేదా ఫేక్..? ఇంట్లోనే సింగిల్ క్లిక్‌తో ఇలా చెక్ చేయొచ్చు.. ఈ సింపుల్ స్టెప్స్ ట్రై చేయండి!

ఇందులో 50MP మెయిన్ సోనీ సెన్సార్ ప్లస్ 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. అయితే, ఫ్రంట్ సైడ్ 5MP సెల్ఫీ కెమెరా మాత్రమే ఉంది. ఈ ఐక్యూ ఫోన్ కెమెరా పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా ఉంది. అవసరమైతే ఈ ఫోన్ రివ్యూ, రేటింగ్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో చెక్ చేయవచ్చు. ఈ ఐక్యూ ఫోన్ 6000mAh లాంగ్-లారింగ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. సింగిల్ ఛార్జ్ తర్వాత 2 రోజుల పాటు ఛార్జింగ్ వస్తుంది.

మీరు ఈ ఫోన్‌ను ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్‌తో త్వరగా ఛార్జ్ చేయవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15పై రన్ అవుతుంది. సేఫ్టీ బెనిఫిట్స్ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ కూడా ఉంది. ఈ ఐక్యూ Z10 లైట్ 5G ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 3.5 mm ఆడియో జాక్, 200 శాతం ఆడియో బూస్టర్‌తో వస్తుంది. మెరుగైన ఆడియో లిజనింగ్ ఎక్స్ పీరియన్స్ కూడా అందిస్తుంది.

ఐక్యూ Z10 లైట్ 5G ఫోన్ ధర ఎంతంటే? :
ఫ్లిప్‌కార్ట్‌లో ఐక్యూ Z10 లైట్ 5G ఫోన్ ప్రస్తుత ధర దాదాపు రూ. 13,999 ఉండగా, 20శాతం ధర తగ్గింపు అందిస్తోంది. తద్వారా ఈ ఐక్యూ ఫోన్‌ను కేవలం రూ. 10,379కు పొందవచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే.. అదనంగా 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

మీరు ఏదైనా పాత ఫోన్‌ను ఐక్యూ Z10 లైట్ 5G ఫోన్‌తో ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. మీరు రూ. 7,150 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. అవసరమైతే స్టాండర్డ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. నెలవారీ ప్రాతిపదికన కేవలం రూ. 365 చెల్లిస్తే సరిపోతుంది.