Aadhaar Card : మీ ఆధార్ కార్డు ఒరిజినల్ లేదా ఫేక్..? ఇంట్లోనే సింగిల్ క్లిక్‌తో ఇలా చెక్ చేయొచ్చు.. ఈ సింపుల్ స్టెప్స్ ట్రై చేయండి!
Aadhaar Card : ఆధార్ కార్డు ఒరిజినల్ కార్డు లేదా నకిలీ ఆధార్ కార్డు అనేది ఇప్పుడు మీ ఇంట్లోనే ఒకే క్లిక్ ద్వారా తెలుసుకోవచ్చు..

Aadhaar Card
Aadhaar Card : మీ ఆధార్ కార్డు ఒరిజినల్ అవునా కాదా? ఎప్పుడైనా చెక్ చేశారా? మీరు వాడే ఆధార్ కార్డు నకిలీది కావొచ్చు. ప్రస్తుతం స్కామర్లు ఆధార్ సంబంధిత మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా వినియోగదారులకు తెలియకుండానే ఫోర్జరీ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆధార్ కార్డును ధృవీకరించడం చాలా ముఖ్యం.
మీకు ఎక్కడైనా ఆధార్ కార్డును ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు మీకు తెలియకుండానే మోసపోతుంటారు. ఎందుకంటే.. ఆధునిక యుగంలో, అత్యంత కీలకమైన డాక్యుమెంట్ ఆధార్ కార్డు.. బ్యాంకుల నుంచి సిమ్ కార్డుల నుంచి ఉద్యోగాల వరకు ప్రతిచోటా తప్పనిసరిగా మారింది. కానీ, ఆధార్ కార్డుల విషయంలో నకిలీ ఆధార్ కార్డులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి.
ఆధార్ కార్డు చూడగానే అది ఒరిజినల్ లేదా ఫేక్ అనేది గుర్తించడం కష్టమే. చూసేందుకు చాలావరకూ నకిలీ ఆధార్ కార్డులు ఒకేలా కనిపిస్తాయి. బయటకు కనిపించే కార్డు రూపం బట్టి అది ఒరిజినల్ కార్డుగా భావిస్తుంటారు. కానీ, మీ ఆధార్ కార్డును ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలి. ఆధార్ కార్డు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితం. మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ ఆధార్ కార్డును వెరిఫై చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం..
యూఐడీఏఐ వెబ్‌సైట్ ద్వారా వెరిఫికేషన్ :
- మీ ఆధార్ కార్డు వెరిఫికేషన్ కోసం ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ (uidai.gov.in) విజిట్ చేయాలి.
- మై ఆధార్ సెక్షన్ కింద వెరిఫై ఆధార్ నంబర్ ఆప్షన్ ఎంచుకోవాలి.
- స్క్రీన్‌పై కనిపించే 12 అంకెల ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.
- మీరు వెరిఫై బటన్‌ను క్లిక్ చేసిన వెంటనే ఆధార్ నంబర్ యాక్టివ్‌గా ఉందో లేదో వెంటనే తెలుసుకోవచ్చు.
- ఆధార్ యాక్టివ్‌గా కనిపిస్తే కార్డు లీగల్ అయినట్టే..
ఆధార్ వెరిఫికేషన్ కోసం mAadhaar యాప్ ఎలా వాడాలంటే? :
యూఐడీఏఐ mAadhaar అనే మొబైల్ యాప్‌ను కూడా అందిస్తోంది. ఈ యాప్ ద్వారా మీ ఆధార్ కార్డు వెరిఫై చేసేందుకు రెండు మార్గాలు ఉన్నాయి.
ఆధార్ నంబర్ వెరిఫై చేయడి : మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి ధృవీకరణ కోసం వెబ్‌సైట్ సూచనలను పాటించండి.
QR కోడ్ స్కాన్ చేయండి : ప్రతి ఆధార్ కార్డుపై QR కోడ్ ఉంటుంది. mAadhaar యాప్‌ని ఉపయోగించి స్కాన్ చేయడం ద్వారా ఆధార్ వివరాలను వెరిఫై చేసుకోవచ్చు.
ఆధార్ కార్డు ధృవీకరణ సర్వీసు పూర్తిగా ఉచితం. మీరు వెబ్‌సైట్ లేదా (mAadhaar) యాప్ ద్వారా ఆధార్ గురించి కొన్ని నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు. ఈ యూఐడీఏఐ ఫీచర్ స్కామర్ల మోసాల నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మీ ఆధార్ అథెంటికేట్ కలిగి ఉందా? లేదా మోసపూరితమైనదా అని ఒకే క్లిక్ లేదా స్కాన్‌తో తెలుసుకోవచ్చు.
మీరు చేయాల్సిందిల్లా.. 12 అంకెల ఆధార్ నంబర్, స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. మీరు వెరిఫై బటన్‌ను క్లిక్ చేసిన వెంటనే ఆధార్ నంబర్ యాక్టివ్‌గా ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఆధార్ యాక్టివ్‌గా ఉంటే కార్డు వ్యాలీడ్ అవుతుంది. వ్యక్తిగత అవసరాల నుంచి ప్రభుత్వ పథకాల వరకు అన్నింటికి వినియోగించుకోవచ్చు.