Samsung Galaxy S25 Ultra : ఈ 5 కెమెరా ఫోన్లు కేక భయ్యా.. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కన్నా క్రేజీ ఫీచర్లు.. ఏ ఫోన్ ధర ఎంతంటే?

Samsung Galaxy S25 Ultra : ఫొటోగ్రఫీ ప్రియుల కోసం 5 ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కన్నా బెటర్ ఫీచర్లు కలిగి ఉన్నాయి.

Samsung Galaxy S25 Ultra : ఈ 5 కెమెరా ఫోన్లు కేక భయ్యా.. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కన్నా క్రేజీ ఫీచర్లు.. ఏ ఫోన్ ధర ఎంతంటే?

Samsung Galaxy S25 Ultra

Updated On : September 7, 2025 / 5:25 PM IST

Samsung Galaxy S25 Ultra : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం భారత మార్కెట్లో అద్భుతమైన కెమెరా ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అందులోనూ (Samsung Galaxy S25 Ultra) శాంసంగ్ గెలాక్సీ S25 కన్నా మెరుగైన ఫొటోగ్రఫీని అందించే 5 స్మార్ట్ ఫోన్లు లభ్యమవుతున్నాయి.

ఈ ఫోన్లలో అడ్వాన్స్ సెన్సార్లు, పవర్ ఫుల్ జూమ్, క్రిస్టల్-క్లియర్ షాట్‌లను కలిగి ఉన్నాయి. మొబైల్ ఫొటోగ్రఫీలో టాప్ పోటీదారులుగా నిలిచాయి. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్‌కు మార్కెట్లో గట్టి పోటీనిస్తున్నాయి. ఇంతకీ ఆయా స్మార్ట్ ఫోన్లు ఏంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..

ఒప్పో ఫైండ్ X8 ప్రో (రూ. 99,999) :
డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో ఒప్పో ఫైండ్ X8 ప్రో 6.78-అంగుళాల LTPO అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ కూడా అందిస్తుంది. ఈ ఒప్పో ఫోన్ క్వాడ్ 50MP ప్రైమరీ కెమెరా సెటప్, అద్భుతమైన 32MP సెల్ఫీ షూటర్‌ కలిగి ఉంది. ఫొటోగ్రఫీలో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాకి బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు.

వివో X200 ప్రో (రూ. 87,990) :

వివో X200 ప్రో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే 6.78-అంగుళాల LTPO అమోల్డ్ ప్యానెల్‌ కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 9400 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ట్రిపుల్ 50MP+200MP+50MP బ్యాక్ కెమెరా సిస్టమ్, 32MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కెమెరా సిస్టమ్‌కు మించిన ఫీచర్లను కలిగి ఉంది.

Read Also : Term Insurance Tips : మీకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కావాలా? పొరపాటున కూడా ఈ 5 మిస్టేక్స్ చేయొద్దు.. లేదంటే భారీగా నష్టపోతారు..!

షావోమీ 15 అల్ట్రా (రూ. 1,09,999) :
షావోమీ 15 అల్ట్రా ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ అందించే 6.73-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌ కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ కు పవర్ అందిస్తుంది. క్వాడ్ 50MP+200MP+50MP+50MP మెయిన్ కెమెరా కాన్ఫిగరేషన్, 32MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా కలిగి ఉంది. ఫొటోగ్రఫీ పరంగా శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాకి పోటీదారుగా నిలిచింది.

ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ (రూ. 1,37,900) :
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఆపిల్ A18 ప్రో ప్రాసెసర్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, 6.9-అంగుళాల సూపర్ రెటినా XDR స్క్రీన్‌ కలిగి ఉంది. ట్రిపుల్ 48MP+12MP+48MP ప్రైమరీ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరా అందిస్తుంది. కెమెరా పవర్ పరంగా శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాకి నేరుగా సరిపోతుంది.

గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL (రూ. 1,17,700) :
గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL 120Hz రిఫ్రెష్ రేట్‌, 6.8-అంగుళాల సూపర్ యాక్టువా ప్యానెల్‌ కలిగి ఉంది. గూగుల్ టెన్సర్ G5 చిప్‌సెట్‌తో పవర్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP+48MP+48MP ట్రిపుల్ బ్యాక్ కెమెరా సిస్టమ్, 42MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కెమెరాలతో గట్టి పోటీనిస్తుంది.