Term Insurance Tips : మీకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కావాలా? పొరపాటున కూడా ఈ 5 మిస్టేక్స్ చేయొద్దు.. లేదంటే భారీగా నష్టపోతారు..!

Term Insurance Tips : టర్మ్ లైఫ్ పాలసీ తీసుకుంటున్నారా? మీ ఫ్యామిలీకి ఫుల్ బెనిఫిట్స్ అందాలంటే కొన్ని మిస్టేక్స్ చేయకూడదు..

Term Insurance Tips : మీకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కావాలా? పొరపాటున కూడా ఈ 5 మిస్టేక్స్ చేయొద్దు.. లేదంటే భారీగా నష్టపోతారు..!

Term Insurance Tips

Updated On : September 7, 2025 / 4:11 PM IST

Term Insurance Tips : మీకు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందా? లేదంటే ఇప్పుడే తీసుకోండి. ప్రస్తుత రోజుల్లో పెట్టుబడితో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా (Term Insurance Tips) ముఖ్యం. అందులోనూ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరిగా ఉండాల్సిందే. భవిష్యత్తులో మీరు లేకున్నా మీ కుటుంబానికి ఈ బీమా పాలసీ అండగా ఉంటుంది.

ఆర్థిక ప్రణాళికల కోసం తరచుగా పెట్టుబడి, సేవింగ్స్ చేస్తుంటారు. కానీ, చాలామంది టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోరు. ఈ విషయంలో పెద్దగా ఆసక్తి చూపించరు. ఈ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మీరు లేనప్పుడు కూడా మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించే పాలసీ కూడా.

నేటి రోజుల్లో ఆరోగ్య బీమాతో పాటు మంచి టర్మ్ ప్లాన్ పొందడం చాలా ముఖ్యం. కానీ, కష్ట సమయాల్లో క్లెయిమ్ కోసం మీ కుటుంబానికి ఎలాంటి సమస్య లేకుండా ఉండేందుకు కొనుగోలు సమయంలో కొన్ని మిస్టేక్స్ అసలు చేయకూడదు.

టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి? :

ముందుగా, టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక నిర్దిష్ట కాలానికి జీవిత బీమా కవర్ తప్పనిసరి. ఈ టర్మ్ పాలసీ ద్వారా అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. పాలసీదారుడు దురదృష్టవశాత్తు మరణిస్తే.. అతని కుటుంబానికి పెద్ద మొత్తంలో ఆర్థిక బీమా లభిస్తుంది.

తద్వారా భార్యాపిల్లల భవిష్యత్తుకు ఆర్థిక మద్దతుగా నిలుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తిగా రక్షణ పథకం అనమాట. దీనిపై ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు. ప్రీమియం కూడా చాలా తక్కువగానే ఉంటుంది.

టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో ఈ 5 మిస్టేక్స్ చేయొద్దు :
మీరు టర్మ్ ప్లాన్ తీసుకోవాలని భావిస్తుంటే.. భవిష్యత్తులో మీ ఫ్యామిలీ క్లెయిమ్ పొందడంలో ఎలాంటి సమస్యను ఎదుర్కోకుండా ఉండేందుకు కొన్ని తప్పులను నివారించడం చాలా ముఖ్యం.

Read Also : Amazon Sale : బిగ్ అలర్ట్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు.. ఈ స్మార్ట్ ఫోన్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు.. ఈఎంఐ ఆఫర్లు కూడా..!

1. తప్పుడు సమాచారం ఇవ్వడం :
టర్మ్ ప్లాన్ కొనుగోలు చేసే ముందు మీ ఆరోగ్యం, అలవాట్లు, ఏదైనా వ్యాధుల గురించి సరైన సమాచారాన్ని ఇవ్వాలి. మీరు ఏదైనా వ్యాధిని దాచిపెడితే క్లెయిమ్ సమయంలో కంపెనీ తిరస్కరించవచ్చు.

2. వైద్య పరీక్షలు చేయించుకోండి :
చాలా సార్లు, చాలామంది పాలసీదారులు ఎలాంటి టెస్టులు చేయించుకోకుండా ఉంటారు. కంపెనీలు కూడా హెల్త్ సర్టిఫికేషన్ ఆధారంగా పాలసీని ఇస్తాయి. కానీ, క్లెయిమ్ సమయంలో పాలసీదారుడు ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నాడని చెప్పవచ్చు. అందుకే, కచ్చితంగా టెస్టులు చేయించుకోండి. ఆ తర్వాతే టర్మ్ పాలసీని ఎంచుకోండి.

3. చౌకైన టర్మ్ ప్లాన్ తీసుకోవద్దు :
చౌకైన ప్రీమియం చూసి టర్మ్ ప్లాన్ తీసుకోవద్దు. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో బాగున్నా క్లెయిమ్ సెటిల్ చేసేందుకు వెనుకాడని బీమా కంపెనీని ఎంచుకోండి. ఒక ప్లాన్ 1 లేదా 2 వేల రూపాయలు చౌకగా ఉన్నప్పటికీ, అవసరమైన సమయంలో మీ కుటుంబానికి సాయం చేయకపోతే ఆ టర్మ్ పాలసీతో ఎలాంటి ఉపయోగం ఉండదు.

4. సరైన వ్యవధిని ఎంచుకోండి :
మీరు 60 ఏళ్ల నుంచి 65 సంవత్సరాల వయస్సులో టర్మ్ ప్లాన్ కొనాలి. కేవలం 15-20 సంవత్సరాలకు ప్లాన్ తీసుకోవద్దు. ఎందుకంటే.. అసలైన ఆర్థిక అవసరాలు 60 సంవత్సరాల తర్వాత మాత్రమే ఉంటాయి. 50 ఏళ్ల తర్వాత టర్మ్ ప్లాన్ కొనడం చాలా ఖరీదైనది కావచ్చు. 25 ఏళ్లు లేదా 30 ఏళ్ల మధ్య టర్మ్ ప్లాన్ తీసుకోవడం బెటర్.

5. ప్రతి ఏడాదిలో రెన్యువల్ చేయడం మర్చిపోవద్దు :
మీరు ఒక బీమా టర్మ్ ప్లాన్ కొనుగోలు చేశాక ప్రతి ఏడాదిలో రెన్యువల్ చేయడం అవసరం. మీరు ఇలా చేయకపోతే మీ పాలసీ ల్యాప్స్ అవుతుంది. మీరు కొత్తగా బీమా పాలసీ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే రెన్యువల్ అనేది ఆటో-పే సిస్టమ్‌కు లింక్ చేసి ఉండాలి. తద్వారా మీ టర్మ్ పాలసీని కోల్పోకుండా నివారించవచ్చు.