Amazon Sale : బిగ్ అలర్ట్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు.. ఈ స్మార్ట్ ఫోన్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు.. ఈఎంఐ ఆఫర్లు కూడా..!

Amazon Sale : శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, ఐఫోన్ 15, వన్ ప్లస్ 13, వివో V60, ఐక్యూ Z10x ఫోన్‌లపై 40శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

Amazon Sale : బిగ్ అలర్ట్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు.. ఈ స్మార్ట్ ఫోన్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు.. ఈఎంఐ ఆఫర్లు కూడా..!

Amazon Sale

Updated On : September 7, 2025 / 3:35 PM IST

Amazon Great Indian Festival Sale : కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ అతి త్వరలో అతిపెద్ద వార్షిక సేల్ ఈవెంట్ (Amazon Sale Offers) ప్రారంభించనుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది. సెలవు సీజన్‌కు ముందే హై-ఎండ్, మిడ్-రేంజ్, తక్కువ-ధర కేటగిరీలో స్మార్ట్‌ఫోన్‌లపై సేల్స్ అమెజాన్ వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై 40శాతం వరకు తగ్గింపు అందిస్తోంది.

ఆసక్తిగల కస్టమర్లు వివో V60, వన్‌ప్లస్ 13, శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, ఐఫోన్ 15, ఐక్యూ Z10x అనేక ఇతర మోడళ్లను రిటైల్ ధర కన్నా చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఎప్పటిలాగే, అమెజాన్ ప్రైమ్ సభ్యులకు సేల్‌కు ముందస్తు యాక్సెస్ పొందవచ్చు.

సెప్టెంబర్ 23న సేల్ ప్రారంభమైన వెంటనే కస్టమర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ తక్కువ ధరలకు అదనంగా ఎస్బీఐ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ కొనుగోళ్లపై 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది. మోడల్, కండిషన్ ఆధారంగా కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడింగ్ చేయడం ద్వారా ఎక్కువ డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. పోర్టల్ గరిష్టంగా 24 నెలల పాటు ఫ్రీ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తుంది.

Read Also : Vivo V50 5G : వివో ఆఫర్ అదుర్స్.. ఇలా కొన్నారంటే.. వివో V50 5G ఫోన్ అతి చౌకైన ధరకే.. డోంట్ మిస్

అమెజాన్ ఫెస్టివల్ స్మార్ట్‌ఫోన్ ఆఫర్లు :

అల్ట్రా-ప్రీమియం కేటగిరీలో కూడా సేవింగ్స్ పొందవచ్చు. రూ. 50వేల కన్నా తక్కువ ధరలో లభించే ఫోన్లలో వన్ ప్లస్ 13s, వన్ ప్లస్ 13, ఐక్యూ 13 5G, శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్లపై కంపెనీ టాప్ ఆఫర్లను అందిస్తోంది.

అంతేకాకుండా, అల్ట్రా-ప్రీమియం వివో X200 FE, వివో X200, టెక్నో ఫాంటమ్ V ఫోల్డ్ 2, మోటోరోలా రెజర్ 60 అల్ట్రా, రియల్ మి జీటీ 7 ప్రో, షావోమీ 15లపై అద్భుతమైన డీల్స్ అందిస్తున్నాయి.

ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు కేటగిరీలోని ఫోన్‌ల ధరలు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు ఉన్నాయి. తక్కువ ధరలో లభించే ఫోన్లలో ఐఫోన్ 15, వన్ ప్లస్ 13R, ఐక్యూ నియో 10, వివో V60, ఒప్పో రెనో 14 వంటి ఫోన్లు ఉన్నాయి. మిడ్-రేంజ్ కేటగిరీలోని ఫోన్‌లపై భారీ డీల్స్ పొందవచ్చు. వన్ ప్లస్ నార్డ్ సీఈ 5, ఐక్యూ నియో 10R, శాంసంగ్ గెలాక్సీ A55, ఐక్యూ Z10R, వన్ ప్లస్ నార్డ్ 5 ఫోన్లు ఉన్నాయి.

ఈ ఫోన్ల ధర రూ. 15వేల నుంచి రూ. 30వేల వరకు ఉంటుంది. రూ.15వేల లోపు స్మార్ట్‌ఫోన్‌లు బడ్జెట్ కేటగిరీలోకి వస్తాయి. రెడ్ మి A4 5G, రియల్ మి నార్జో 80 లైట్ 5G, శాంసంగ్ గెలాక్సీ M36 5G, ఐక్యూ Z10x 5G, ఐక్యూ Z10 లైట్ 5G, అనేక ఇతర మోడళ్లపై డిస్కౌంట్ పొందవచ్చు.