Vivo V50 5G : వివో ఆఫర్ అదుర్స్.. ఇలా కొన్నారంటే.. వివో V50 5G ఫోన్ అతి చౌకైన ధరకే.. డోంట్ మిస్
Vivo V50 5G : వివో అద్భుతమైన ఆఫర్.. ఈ గ్రేట్ డీల్ 29శాతం డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి ఆఫర్ ఎలా పొందాలంటే?

Vivo V50 5G
Vivo V50 5G : కొత్త వివో ఫోన్ కొంటున్నారా? 50MP సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఈ అద్భుతమైన ఆఫర్ అసలు వదులుకోవద్దు. విజయ్ సేల్స్ సమయంలో వివో V50 5G ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది.
ఈ వివో ఫోన్ కంపెనీ ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డీల్స్ కూడా అందిస్తోంది. 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ధర అమెజాన్‌లో రూ. 34,999కు ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వివో ఫోన్ కొనుగోలుపై రూ. 2వేలు నేరుగా డిస్కౌంట్ పొందవచ్చు.
అంతేకాదు.. బ్యాంక్ ఆఫర్ కోసం రూ. 3,500 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మీరు మొత్తాన్ని ఒకేసారి పే చేయకుండా ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. 24 నెలలకు నెలకు రూ. 1600 నుంచి ఈఎంఐ చెల్లించవచ్చు. మీరు ఈ వివో 5G ఫోన్ కొనాలనుకుంటే ఇప్పుడే ఆర్డర్ చేయడం బెటర్. ఎందుకంటే.. ఈ ఆఫర్ లిమిటెడ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.
వివో V50 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఈ వివో స్మార్ట్‌ఫోన్ IP68, IP69 సర్టిఫికేషన్ కలిగి ఉంది. 6.77-అంగుళాల ఫుల్ HD + కర్వ్డ్ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. గరిష్ట ప్రకాశంతో 4500 నిట్స్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. ఈ వివో ఫోన్ టాప్ మోడల్‌లో 512GB యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ, 12GB LPDDR4x ర్యామ్ కూడా ఉన్నాయి. ప్రాసెసింగ్ విషయానికి వస్తే.. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌ను ఉపయోగిస్తుంది.
కెమెరా విషయానికొస్తే.. బ్యాక్ ప్యానెల్‌లో 50MP ప్రైమరీ OIS కెమెరాతో పాటు 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉంది. అలాగే, 50MP ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. బ్యాటరీ విషయానికొస్తే.. 6000mAh సామర్థ్యాన్ని కలిగి ఉంది. అలాగే, 90W వేగంగా ఛార్జ్ చేయవచ్చు.
సెక్యూరిటీ విషయానికి వస్తే.. వివో ఫోన్‌లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్ సాఫ్ట్‌వేర్ ఫన్ టచ్ OS15, ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రన్ అవుతుంది. 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6 (802.11 be), బ్లూటూత్ 5.4, USB టైప్-C 2.0 కనెక్టివిటీ ఆప్షన్లలో వస్తుంది.