Apple iPhone 17 Pro Max : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ వచ్చేస్తోందోచ్.. ధర, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్లు, లీక్ వివరాలివే..!
Apple iPhone 17 Pro Max : కొత్త ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ లాంచ్ కానుంది. భారత మార్కెట్లో ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ తేదీ, ధర, స్పెషిఫికేషన్ల వివరాలివే

Apple iPhone 17 Pro Max
Apple iPhone 17 Pro Max : ఆపిల్ కొత్త ఐఫోన్ రాబోతుంది. ఐఫోన్ 17 సిరీస్ అతి త్వరలో లాంచ్ అయ్యేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పుడు ఆపిల్ లవర్స్ దృష్టి ఈ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ పైనే ఉంది. పుకార్లు నిజమైతే.. ఈ ఐఫోన్ మెరుగైన కెమెరా, డిస్ ప్లే, అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఆకర్షణీయమైన డిజైన్‌తో రానుంది.
అదనంగా, ఐఫోన్ 16 ప్రో మాక్స్ తో పోలిస్తే.. ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర కూడా భారీగానే ఉంటుందని లీక్‌లు సూచిస్తున్నాయి. అయితే, ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు రివీల్ కాలేదు. భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ లాంచ్ తేదీ, అంచనా ధర, స్పెసిఫికేషన్లు, డిజైన్ మార్పులకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి.
ఐఫోన్ 17 ప్రో మాక్స్ లాంచ్ తేదీ (అంచనా) :
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రోలతో పాటు సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానున్నాయి. ఈ డివైజ్‌లు అదే రోజున ప్రీ-బుకింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 19 నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Apple iPhone 17 Pro Max : ఐఫోన్ 17 ప్రో మాక్స్ డిజైన్ (అంచనా) :
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ కొత్త దీర్ఘచతురస్రాకార కెమెరా ఐలాండ్ కలిగి ఉండొచ్చు. ట్రిపుల్ కెమెరా సెటప్, ఫ్లాష్, లిడార్ సెన్సార్ రైట్ సైడ్ ఉండొచ్చు. ఐఫోన్ 16 ప్రో మాక్స్ మాదిరిగా టైటానియం ఫ్రేమ్ నుంచి అల్యూమినియం+గ్లాస్ డిజైన్ ఉండొచ్చు.
ఈ ఐఫోన్ యాక్షన్ బటన్, కెమెరా కంట్రోల్స్ మరిన్నింటిని కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రత్యేకమైన స్టీమ్ కూలింగ్ రూమ్ కూడా ఉండవచ్చు. ఫ్రంట్ సైడ్ ఈ ఐఫోన్ చిన్న డైనమిక్ ఐలాండ్, చిన్న బెజెల్స్, భారీ స్క్రీన్‌ను పొందవచ్చు.
ఐఫోన్ 17 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ 6.9-అంగుళాల ప్రోమోషన్ OLED ప్యానెల్ కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఈ డివైజ్ ఆపిల్ 19 ప్రో చిప్‌ను పొందే అవకాశం ఉంది. 12GB ర్యామ్, బేస్ 256GB స్టోరేజ్‌తో రావొచ్చు. 5,000mAh బ్యాటరీ, మెరుగైన ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
iOS 26 అప్‌డేట్, కొత్త ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లలో రన్ అవుతుంది. కెమెరా విషయానికొస్తే.. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 5x ఆప్టికల్ జూమ్‌తో 48MP మెయిన్, 48MP అల్ట్రావైడ్, 48MP టెలిఫోటో సెన్సార్‌ను పొందవచ్చు. ఫ్రంట్ సైడ్ 24MP సెల్ఫీ కెమెరా కూడా ఉండొచ్చు.
భారత్, యుఎస్, దుబాయ్‌లలో ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర (అంచనా) :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ 256GB స్టోరేజ్ ధర రూ.1,64,990గా ఉండొచ్చు. ఐఫోన్ 16 ప్రో మాక్స్ ధర రూ.1,44,990గా ఉండొచ్చు. అమెరికాలో ఈ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర 1,249 డాలర్లుగా, దుబాయ్‌లో AED 5,299 గా ఉండొచ్చు.