Mahindra SUV Prices : మహీంద్రా థార్, స్కార్పియో, బొలెరో, XVU700 SUV కార్లపై భారీ తగ్గింపు.. చౌకైన ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు..!
Mahindra SUV Prices : మహీంద్రా ఐసీఈ ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియో అంతటా జీఎస్టీ 2.0 ప్రయోజనాలను తక్షణమే అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.

Mahindra SUV Prices
Mahindra SUV Prices : ప్రముఖ ఆటో మేకర్ మహీంద్రా అండ్ మహీంద్రా (M&M) కార్ల ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. జీఎస్టీ రేట్ల తగ్గింపు పూర్తి ప్రయోజనాన్ని (Mahindra SUV Prices) వినియోగదారులకు అందిస్తామని కంపెనీ తెలిపింది. మొత్తం ఐసీఈ SUV పోర్ట్‌ఫోలియో ధరలను మార్చింది. ఈ కొత్త ధరలు 6 సెప్టెంబర్ 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. డీలర్‌షిప్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా కార్ల కొత్త ధరలు అందుబాటులో ఉంటాయి.
మహీంద్రా మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీలపై ఈ తగ్గింపు అందిస్తుంది. కంపెనీ థార్, స్కార్పియో, బొలెరో, XUV700, స్కార్పియో-N ఇప్పుడు గతంలో కన్నా రూ.1.01 లక్షల నుంచి రూ.1.56 లక్షల వరకు తగ్గింపు పొందాయి.
బొలెరో, బొలెరో నియోలపై కస్టమర్లు రూ.1.27 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. మహీంద్రా XUV3XO పెట్రోల్ ధరను రూ.1.40 లక్షలు తగ్గించింది. మహీంద్రా XUV3XO డీజిల్ గరిష్ట ధరను రూ.1.56 లక్షలు తగ్గించింది.
టాటా బాటలోనే మహీంద్రా :
థార్ 2WD డీజిల్ పై రూ.1.35 లక్షల వరకు, థార్ 4WD డీజిల్, స్కార్పియో క్లాసిక్ పై రూ.1.01 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది. స్కార్పియో-ఎన్ ఇప్పుడు రూ.1.45 లక్షలు చౌకగా మారింది. థార్ రాక్స్ ధర రూ.1.33 లక్షలు, కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోడల్ మహీంద్రా XUV700 రూ.1.43 లక్షలు తగ్గాయి. మహీంద్రా మాత్రమే కాదు.. టాటా మోటార్స్ కూడా ధరల తగ్గింపును ప్రకటించింది. టాటా టియాగో ధర రూ.75,000, టిగోర్ ధర రూ.80,000, ఆల్ట్రోజ్ ధర రూ.1.10 లక్షలు తగ్గనుంది.
కంపెనీకి చెందిన SUV పంచ్‌కు రూ.85,000, నెక్సాన్‌కు రూ.1.55 లక్షల రాయితీ అందిస్తోంది. అదే సమయంలో, టాటా హారియర్, సఫారీ ధరలను వరుసగా రూ.1.40 లక్షలు, రూ.1.45 లక్షలు తగ్గించాయి. జీఎస్టీలో ఈ కొత్త మార్పు ఆటో రంగంలో అమ్మకాలకు కొత్త ఊపునిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. పండుగ సీజన్‌లో కస్టమర్లు ఇప్పుడు చౌకైన కార్లు, ఎస్ యూవీ కార్లను సొంతం చేసుకోవచ్చు.
ఈ వారమే జీఎస్టీ కౌన్సిల్ ఆటోమొబైల్స్ కోసం పన్ను శ్లాబ్‌లను ఆమోదించింది. నవరాత్రి ప్రారంభంతో సెప్టెంబర్ 22 నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయి.
సవరించిన జీఎస్టీ ప్రకారం.. 1,200CC కన్నా తక్కువ ఇంజిన్ సామర్థ్యం, 4,000 మిమీ పొడవు కలిగిన పెట్రోల్, ఎల్‌పీజీ లేదా సీఎన్‌జీతో నడిచే వాహనాలు, 1,500CC, 4,000 మిమీ వరకు డీజిల్ వాహనాలతో పాటు, ఇప్పుడు 18 శాతం జీఎస్‌టీ పరిధిలోకి వస్తాయి.
1,200CC పెట్రోల్ లేదా 1,500CC డీజిల్ కన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన 4,000 మిమీ కన్నా ఎక్కువ పొడవు ఉన్న పెద్ద వాహనాలపై 40 శాతం పన్ను విధించాలని కౌన్సిల్ నిర్ణయించింది.