Samsung Galaxy F05 : రూ. 7వేల లోపు ధరకే కొత్త శాంసంగ్ ఫోన్.. ఏకంగా 37 శాతం డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!
Samsung Galaxy F05 : శాంసంగ్ గెలాక్సీ F05 ఫోన్ కొనుగోలుపై 37 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. రూ. 7వేల కన్నా తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy F05
Samsung Galaxy F05 : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ గెలాక్సీ F05 ఫోన్ అతి తక్కువ బడ్జెట్ ధరకే లభిస్తోంది. రూ. 7వేల బడ్జెట్‌లో బెస్ట్ ఫోన్ (Samsung Galaxy F05) కోసం చూస్తుంటే ఈ శాంసంగ్ ఫోన్ అసలు వదులుకోవద్దు. ఈ 4G ఫోన్ అన్ని ఫీచర్లతో ఆకర్షణీయంగా ఉంది.
ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే.. వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్‌తో HD+ PLS LCD డిస్ ప్లే, ప్రీమియం లెదర్ ప్యాటర్న్ డిజైన్, పవర్ ఫుల్ మీడియాటెక్ చిప్‌సెట్, 8GB వరకు వర్చువల్ ర్యామ్ సపోర్టు అందిస్తుంది.
5000mAh బ్యాటరీ ప్యాక్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో బెస్ట్ కెమెరా సెటప్ పొందవచ్చు. సెప్టెంబర్ 2025లో ఫ్లిప్ కార్ట్ ప్రారంభ బర్డ్ డీల్స్‌లో 37శాతం తగ్గింపు తర్వాత ఈ ఫోన్‌ను రూ. 7వేల కన్నా తక్కువ ధరకు అందిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ F05 ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ F05 ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 6.74-అంగుళాల HD+ PLS LCD డిస్ప్లేతో స్టాండర్డ్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. కేవలం కాలింగ్ తో పాటు కంటెంట్ వినియోగం కోసం అయితే ఈ ఫోన్ బెస్ట్ అని చెప్పొచ్చు. పవర్ ఫుల్ మీడియాటెక్ హెలియో G85 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో సాధారణ గేమింగ్ కోసం కూడా వినియోగించవచ్చు.
ఈ ఫోన్ 4GB LPDDR4X ర్యామ్ తో వస్తుంది. ర్యామ్ ప్లస్ ఫీచర్ ద్వారా వర్చువల్ గా 8GB వరకు విస్తరించవచ్చు. 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా పొందవచ్చు. మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు.
ఈ ఫోన్ శాంసంగ్ వన్ యూఐ కోర్ 6.0తో ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. అయితే ఫ్రంట్ సైడ్ 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 60fps వద్ద ఫుల్ HD రిజల్యూషన్‌లో వీడియోలను రికార్డ్ చేయవచ్చు.
అంతేకాదు.. ఈ శాంసంగ్ ఫోన్ నాన్ రిమూవబుల్ 5000mAh లాంగ్-లాస్టింగ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. సాధారణ వినియోగంతో 2 రోజులు ఛార్జింగ్ వస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా పొందవచ్చు.
మీరు ఛార్జర్‌ను విడిగా కొనుగోలు చేయాలి. ఎందుకంటే బాక్స్‌లో లభించదు. ఈ శాంసంగ్ గెలాక్సీ F05 మోడల్ 4G ఫోన్ మాత్రమే. మీకు 5G ఫోన్ కావాలంటే.. మరో ఫోన్ కొనడమే బెటర్. కానీ, మీ ఇంట్లో సొంత Wi-Fi ఉంటే ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ F05 ధర తగ్గింపు :
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ F05 ఫోన్ ప్రస్తుత లిస్టెడ్ ధర దాదాపు రూ. 9,999 ఉంటుంది. కానీ, 37శాతం తగ్గింపు తర్వాత ఈ శాంసంగ్ ఫోన్‌ను కేవలం రూ. 6,249కు పొందవచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.
ఈ ఫోన్‌తో ఎక్స్ఛేంజ్ చేసుకోవాలనుకునే ఏదైనా పాత ఫోన్ ఉంటే.. రూ. 4,150 వరకు బెనిఫిట్ పొందవచ్చు. మీరు ఈ ఫోన్‌ను ఈఎంఐ ఆప్షన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. ప్రతి నెలా ఈఎంఐ కేవలం రూ. 220 చెల్లించాల్సి ఉంటుంది.