Kerala: కేరళలో దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. గొంతునులిమి హత్య ..

కేరళ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. పోస్టుమార్టంలో నివేదికలో బాలికను అతి దారుణంగా చిత్రహింసలకు గురిచేసి చంపేశాడని వెల్లడైంది.

Thiruvananthapuram

Thiruvananthapuram : కేరళ రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎర్నాకులం జిల్లాలో ఐదేళ్ల బాలికపై వలస కార్మికుడు లైంగిక వేధింపులకు పాల్పడి గొంతుకోసం హత్య చేశాడు. శుక్రవారం బాలిక మృతదేహాన్ని గోనె సంచిలో పడేశాడు. నిందితుడిని శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. అయితే, అప్పుడు నిందితుడు మత్తులో ఉండటంతో సమాచారం రాబట్టలేక పోయారు. తాజాగా పోలీసులు నిందితుడిని విచారించగా.. నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు.

Tank Bund Car Accident : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కారు బీభత్సం

బీహార్‌కు చెందిన దంపతులకు ఓ కుమార్తె ఉంది. శుక్రవారం సాయంత్రం కనిపించకుండా పోయింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీటీవీ పుటేజీలను పరిశీలించగా బీహార్‌కు చెందిన అస్పాక్ అస్లాం తనతోపాటు బాలికను తీసుకెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు శుక్రవారం రాత్రి 9.30గంటల సమయంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో నిందితుడు స్పృహలో లేడని, మద్యం సేవించి ఉన్నాడని ఎర్నాకులం రూరల్ ఎస్పీ వివేక్ కుమార్ తెలిపాడు. శనివారం ఉదయం విచారించగా.. నేరం అంగీకరించాడని, బాలికను ఎక్కడికి తీసుకెళ్లాడో సమాచారం ఇచ్చాడని ఎస్పీ చెప్పారు.

Eye Infections : ఢిల్లీలో భారీగా పెరిగిన కండ్ల కలక కేసులు.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

బాలిక కుటుంబం నివాసం ఉంటున్న భవనంలోనే నిందితుడు నివసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం మార్కెట్ లోని స్థానికులు డంపింగ్ యార్డులో అనుమానాస్పదంగా ఉన్న గోనె సంచి కనిపించినట్లు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా చెత్తకుప్పలో ఉన్న గోనె సంచిని బయటకు తీసి తెరవగా చిన్నారి మృతదేహం కనిపించింది. చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, పోస్టుమార్టం నివేదికలో.. అతి దారుణంగా అత్యాచారం చేసి చిత్రహింసలకు గురిచేసి చంపేశాడని వెల్లడైంది. ఈ ఘటనతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తంమవుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చిన్నారిని ప్రాణాలతో గుర్తించలేక పోయామని తల్లిదండ్రులకు పోలీసులు క్షమాపణలు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు