Jawans killed: నదిలో పడ్డ బస్సు.. ఆరుగురు ఐటీబీపీ జవాన్ల మృతి

అమర్‌నాథ్ వద్ద విధులు ముగించుకుని తిరుగు ప్రయాణమైన జవాన్లలో ఆరుగురు బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మంగళవారం ఉదయం పహల్గాం ప్రాంతంలో జరిగింది.

Jawans killed: జమ్ము-కాశ్మీర్‌లో దారుణం జరిగింది. అనంత్ నాగ్ జిల్లా, పహల్గాం ప్రాంతంలో సైనికులు ప్రయాణిస్తున్న బస్సు నదిలో పడటంతో ఆరుగురు జవాన్లు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది.

Chinese Ship: శ్రీలంక పోర్టుకు చేరుకున్న చైనా నిఘా నౌక.. భారత ఆందోళన బేఖాతరు

చందన్‌వారి నుంచి బస్సు పహల్గాం వెళ్తుండగా, బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో బస్సు చాలా ఎత్తు నుంచి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో 37 మంది ఐటీబీపీ (ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్) సిబ్బంది కాగా, మరో ఇద్దరు స్థానిక పోలీసులు. వీరంతా అమర్‌నాథ్ వద్ద విధులు ముగించుకుని తిరిగి వెళ్తున్నారు.

FIFA: ఏఐఎఫ్ఎఫ్‌పై ఫిఫా నిషేధం.. దేశంలో ఫుట్‌బాల్ వరల్డ్ కప్ నిర్వహణ డౌటే!

ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుల్ని శ్రీనగర్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు