Bank loan : లోన్ ఇవ్వలేదని పెట్రోల్ పోసి బ్యాంకుకు నిప్పు పెట్టిన యువకుడు

లోన్ ఇవ్వలేదని పెట్రోల్ పోసి బ్యాంకుకు నిప్పు పెట్టాడు ఓ యువకుడు.

bank loan man sets bank on fire for refusing to give loan : హైస్ లోన్, కారు లోన్ ఇలా అవసరాలనుబట్టి బ్యాంకులకు వెళ్లి లోన్ అడుగుతాం. అప్లికేషన్ పెట్టుకుంటాం. ఇవ్వకపోతే ఊరుకుంటాం. కానీ కర్ణా‌ట‌కలో ఓ యువకుడు మాత్రం ఊరుకోలేదు. ఏకంగా లోన్ ఇవ్వను అన్న బ్యాంకుకు నిప్పు పెట్టాడు.దీంతో సదరు యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.

కర్ణా‌ట‌కలోని హవేరీ జిల్లాలో శని‌వారం (జనవరి8,2022) జరిగిందీ షాకింగ్ ఘటన. రత్తి‌హళ్లి పట్ట‌ణంలో ఉండే వసీం హజా‌ర‌స్తాబ్‌ ముల్లా అనే 33 ఏళ్ల యువకుడు హెదు‌గొండ గ్రామంలో ఉన్న కెనరా బ్యాంకులో లోను కోసం అప్లై చేసుకున్నాడు.

బ్యాంకు ఉద్యోగులు అతని డాక్యుమెంట్లను పరిశీలించారు. అతని సిబిల్‌ స్కోరు తక్కు‌వగా ఉందని బ్యాంకు అతనికి లోన్ ఇవ్వటం కుదరదు అని స్పష్టంచేసింది. ఎవరన్నా అయితే ఊరుకుంటారు. కానీ వసీం మాత్రం ఊరుకోలేదు. తనకు లోన్ ఇవ్వని బ్యాంకు అధికారులపై కోపం పెంచుకున్నాడు. ఆ కోపంలో విచక్షణ మరచిపోయాడు. శని‌వారం రాత్రే బ్యాంకు కిటి‌కీలు పగు‌ల‌గొట్టి లోపల పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టాడు.

అతగాడు చేసిన ఈ ఘనకార్యానికి బ్యాంకులోని ఐదు కంప్యూ‌టర్లు, డాక్యు‌మెంట్లు మంటల్లో కాలి‌పో‌యా‌యి. రూ.12 లక్షల నష్టం సంభ‌విం‌చిం‌దని బ్యాంకు ఉద్యోగుల ఫిర్యాదు మేరకు పోలీ‌సులు వసీంపై కేసు నమోదు చేసుకుని అరెస్టు చేశారు. బ్యాంకుకు నిప్పంటించిన వసీంపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 246, 477, 435 కింద కేసు నమోదు చేశారు.

 

 

ట్రెండింగ్ వార్తలు