Fraudsters Cheating Rs.12 Lakhs : పార్ట్ టైం జాబ్ పేరుతో రూ.12 లక్షలు దోచేశారు

పార్ట్ టైం జాబ్ పేరుతో మోసగాళ్లు ఒక వ్యక్తి వద్దనుంచి రూ. 12 లక్షలు దోచేశారు.  అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలలో పార్ట్ టైం జాబ్ పేరుతో ఇటీవల చాలామంది సెల్ ఫోన్స్ క

Fraudsters Cheating Rs.12 Lakhs :  పార్ట్ టైం జాబ్ పేరుతో మోసగాళ్లు ఒక వ్యక్తి వద్దనుంచి రూ. 12 లక్షలు దోచేశారు.  అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలలో పార్ట్ టైం జాబ్ పేరుతో ఇటీవల చాలామంది సెల్ ఫోన్స్ కు మెసేజ్ లు వస్తున్నాయి.

కరోనా కష్టకాలంలో ఉద్యోగాలు పోయి చాలా మంది నిరుద్యోగులయ్యారు. ఎక్కడ ఏ అవకాశం దోరుకుతుందా… ఏదో ఒక ఉద్యోగం చేద్దామని ఎదురుచూస్తున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోటానికి ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని కొందరు దుండగులు నిరుద్యోగులను మోసం చేస్తున్నారు.

అలా తనఫోన్ కు వచ్చిన  మెసేజ్ చూసి మోసపోయిన యువకుడి ఉదంతం హైదరాబాద్ బాలానగర్‌లో  చోటు చేసుకుంది.  బాలానగర్ కు చెందిన అనిల్ కుమార్ అనే యువకుడు ఇన్ఫోసిస్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఫ్లిప్ కార్ట్ లో పార్ట్ టైం జాబ్ అనే పేరుతో ఇటీవల అతని ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది.
Also Read : Illegal Affair Murder : వివాహేతర సంబంధం.. ఆమె కోసం అన్నీ అమ్మేస్తున్న భర్త

పార్ట్ టైం జాబ్ కదా నాలుగు డబ్బులు సంపాదించుకుందామని చెప్పి ఆ మెసేజ్ లో ఉన్న లింకు ఓపెన్ చేశాడు. వస్తువుల కొనుగోలుతో లాభాలు వస్తాయని మరో లింక్ పంపించారు  సైబర్ నేరగాళ్లు.  అది పూర్తి చేసిన అనిల్ కుమార్ మొదటి విడతలో రూ.9.67 లక్షలు చెల్లించి రిజిష్టర్ అయ్యాడు.

అనంతరం నగదు విత్ డ్రా చేసుకోవాలంటే రూ. 3.31 లక్షలతో రీఛార్జి చేయాలని మళ్లీ మెసేజ్ పంపారు సైబర్ నేరగాళ్లు. ఇలా రెండు విడతల్లో రూ.12.98 లక్షల నగదు చెల్లించాడు అనిల్.  రెండు సార్లు నగదు చెల్లించిన తర్వాత, తాను మోసపోయాననే విషయాన్నిగ్రహించిన అనిల్   బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు