Wife Harassment : భార్య వేధింపులతో బ్యాంకు ఉద్యోగి బలవన్మరణం

ఉన్నత చదువులు చదివి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి భార్య, ఆమె కుటుంబ సభ్యులు పెట్టే  వేధింపులు భరించలేక ఆత్మహత్య   చేసుకున్న  ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

Wife Harassment :  ఉన్నత చదువులు చదివి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి భార్య, ఆమె కుటుంబ సభ్యులు పెట్టే  వేధింపులు భరించలేక ఆత్మహత్య   చేసుకున్న  ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

గోల్కోండ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్ పేటకు చెందిన   సంతోష్(36) బ్యాంక్  ఆఫ్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు.   ఇతడికి2013 లో ఓల్డ్ సిటీకి చెందిన కళ్యాణి అనే మహిళతో వివాహం అయ్యింది. వీరికి అభిరామ్(6) అనే కొడుకు ఉన్నాడు.

కొంతకాలంగా కొడుకు అభిరామ్ కు  అనారోగ్యంగా ఉంది.  దీంతో కళ్యాణి భర్తను వేధించసాగింది. ఆమెతో పాటు అత్తింటి వారు కూడా సంతోష్‌ను    వేధించసాగారు.   భార్య, ఆమె  కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక ఆత్మహత్య   చేసుకోవాలని  నిర్ణయించుకున్నాడు. ఆన్ లైన్ లో పురుగుల మందు తెప్పించుకున్నాడు.

Also Read : Raging : వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం

శుక్రవారం రాత్రి కూల్ డ్రింక్‌లో ఆ మందును కలుపుకొని తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి  తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కేసు  నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంతోష్ ఫోన్‌ను  స్వాధీనం చేసుకుని పరీశిలించగా… ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో బయట పడింది.

తన మరణానికి భార్య కళ్యాణి కారణమని అందులో స్పష్టం చేశాడు.  ఇప్పటి వరకు మూడుసార్లు తనపై అత్తింటి వారు హత్యాయత్నం చేశారని,  ఎప్పడూ తనపై కేసులు పెడుతూ, పంచాయితీలతో తనను వేధింపులకు  గురిచేశారని తెలిపాడు.  కళ్యాణి తల్లిదండ్రులు అరుణ, పండరినాథ్, కళ్యాణి సోదరుడు గణేష్‌, బాబాయి భీమ్‌ తనపై హత్యాయత్నం చేశారని సంతోష్ ఆ వీడియోలో ఆరోపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు