Kerala Couple : ఫేస్‌బుక్‌ ఫ్రెండ్ పేరుతో మోసం.. కేరళ దంపతుల బ్యాంకు అకౌంట్లలో నుంచి రూ. 20 లక్షలు కొట్టేసిన మోసగాళ్లు

Kerala Couple : సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయక యూజర్లను లక్ష్యంగా చేసుకుని అనేక మోసగాళ్లకు పాల్పడుతున్నారు.

Kerala Couple : సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయక యూజర్లను లక్ష్యంగా చేసుకుని అనేక మోసగాళ్లకు పాల్పడుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే.. వాళ్ల చేతుల్లో అడ్డంగా మోసపోవాల్సి వస్తుంది. అందుకే సోషల్ అకౌంట్లలో యూజర్లు తమ వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌లో షేర్ చేయరాదు లేదా గుర్తు తెలియని వ్యక్తులను ఎప్పుడూ నమ్మరాదని గుర్తించాలి. మీ చిన్న నిర్లక్ష్యం కారణంగా ఆర్థిక నష్టం వంటి సైబర్ నేరాల బారిన పడేలా చేస్తుంది. కేరళకు చెందిన దంపతులను ఓ వ్యక్తి ఫేస్‌బుక్ స్నేహితుడు పేరుతో నమ్మించి వారి బ్యాంకు అకౌంట్లో నుంచి రూ.20 లక్షలు కాజేశాడు.

ఇటీవల నమోదైన కేసులో.. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ పేరుతో ఒక గుర్తు తెలియని వ్యక్తి, కేరళ దంపతుల నుంచి రూ.20 లక్షలు కాజేశాడు. ఓ నివేదిక ప్రకారం.. విదేశాల్లో నివసిస్తున్న భర్త ఫేస్‌బుక్‌లో గుర్తు తెలియని వ్యక్తితో స్నేహం చేశాడు. ఆ తరువాత అతనితో వాట్సాప్‌లో కనెక్ట్ అయ్యాడు. ఇరువరి మధ్య సంభాషణ జరిగింది. అయితే, నిందితుడు తాను విదేశాలలో నివసిస్తున్నట్లు తెలిపాడు. తాను భారత్ వచ్చినప్పుడల్లా తమను కలుస్తానని దంపతులకు హామీ ఇచ్చాడు. అలా దంపతులను మరింత నమ్మించాడు. అలా ఒక మంచి స్నేహితుడు అయ్యాడు.

Read Also :QR Code Scam : QR కోడ్ స్కామ్‌తో తస్మాత్ జాగ్రత్త.. ఇలాంటి స్కామర్ల నుంచి ఎలా సేఫ్‌గా ఉండాలి? ఎలా గుర్తించాలో తెలుసా?

డిసెంబర్ 2022 ప్రారంభంలో.. ఫేస్‌బుక్ స్నేహితుడు దంపతులను కలిశాడు. తాను భారత్‌కు వచ్చినట్లు తెలియజేశాడు. అంతర్జాతీయ రాకపోకల్లో లగేజీని కస్టమ్స్ స్వాధీనం చేసుకున్నట్లు నమ్మబలికాడు.అందుకు తనకు కొంత ఆర్థిక సాయం చేయాలని కోరాడు. న్యూఢిల్లీ విమానాశ్రయానికి చేరుకునేటప్పుడు కస్టమ్స్ తనను అడ్డగించి, తన వద్ద ఉన్న లగేజీని స్వాధీనం చేసుకుందని చెప్పాడు. అందులో రూ. 3 కోట్ల డిమాండ్ డ్రాఫ్ట్ కూడా ఉందని చెప్పాడు. కస్టమ్స్ నుంచి DDని తెచ్చుకునేందుకు తనకు సాయం కావాలని కోరాడు. DD మొత్తాన్ని ఒకేసారి తిరిగి చెల్లిస్తానని నమ్మించి వారి వద్ద నుంచి రూ. 20 లక్షలు కాజేసినట్టు పోలీసు అధికారి ప్రకటనలో వెల్లడించారు.

Kerala Couple duped by a Facebook friend, loses 20 lakh

దంపతులు నిందితుడిని మంచి స్నేహితుడిగా నమ్మడంతో అతనికి సాయం చేసేందుకు అంగీకరించారు. స్నేహితులు, ఇతర బంధువుల నుంచి అవసరమైన డబ్బును ఏర్పాటు చేశాడు. బాధితురాలు 11 బ్యాంకులు, UPI లావాదేవీల ద్వారా పేమెంట్ చేశారు. డిసెంబరు 7, 14 మధ్య నిందితుడికి సుమారు రూ. 20.05 లక్షలను పంపారు.

నగదు బదిలీలను స్వీకరించిన తర్వాత ఆ దంపతులు తాము మోసపోయినట్టు గుర్తించారు. వెంటనే, కేరళ దంపతులు ఎర్నాకుళం రూరల్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ కేసు దర్యాప్తులో ఉంది. ఏయే బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులు పంపించారో పోలీసులు ఆరా తీస్తూ అకౌంట్లను ఫ్రీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Mumbai Woman Train Ticket : ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ వివరాలను షేర్ చేసిన మహిళ.. రూ.64వేలు కొట్టేశారు.. అసలేం జరిగిందంటే?

ట్రెండింగ్ వార్తలు