Selfie Suicide : లైంగిక వేధింపులు తాళలేక వివాహిత సెల్ఫీ సూసైడ్

కరీంనగర్ జిల్లాలో లైంగిక వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Married woman selfie suicide : కరీంనగర్ జిల్లాలో లైంగిక వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లాలోని కాపువాడలో నివాసముంటున్న అరుణ అనే వివాహిత ఆమెను బావ కనకయ్య లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో సెల్ఫీ వీడియోతో పాటుగా సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బావ కనకయ్య లైంగికంగా వేదిస్తుండడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా మృతురాలు అరుణ వీడియోలో వెల్లడించారు.

భర్త లేని సమయంలో ఇంటికి వచ్చి బావ కనకయ్య లైంగిక వేధింపులకు గురి చేశాడని వీడియోలో వాపోయారు. పిల్లలకు తప్పుగా చెప్పుతానని బెదిరించాడని తెలిపారు. వేధింపులు భరించలేక పోతున్నట్లు వెల్లడించారు. మిషిన్ కుట్టుకుని పిల్లలను పోషించుకుంటూ పరువుగా బతికానని తెలిపారు.

Corona Cases : దేశంలో కొత్తగా 9,765 కరోనా కేసులు.. 477 మంది మృతి

లొంగడం లేదని డబ్బులు ఇవ్వాలని చెప్తున్నాడని వీడియోలో పేర్కొన్నారు. పరువు పోతుందని చనిపోవడానికి సిద్ధమయ్యానని తెలిపారు. పిల్లలకి అన్యాయం చేసి పోతున్నా.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి జోలికి పోకుండా జాగ్రత్తగా బతకాలంటూ పిల్లలకు బాధితురాలు చివరి మాటగా చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు