Nurse Gangraped : ఆసుపత్రిలో దారుణం.. నర్సుని గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన డాక్టర్, సిబ్బంది

Nurse Gangraped - Bihar

Nurse Gangraped - Bihar (Photo : Google)

Nurse Gangraped – Bihar : మహిళలకు రక్షణ కరువైంది. దేశంలో నిత్యం ఏదో ఒక చోట ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు చేస్తున్నా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడవాళ్లపై అకృత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా బీహార్ లో దారుణం జరిగింది. నర్సు ని డాక్టర్, కాంపౌండర్లు గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారు.

ఈస్ట్ చంపారన్ జిల్లాలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ లో హోమ్ ఘోరం జరిగింది. ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న మహిళను డాక్టర్, ఆసుపత్రి సిబ్బంది సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను చంపారు. మోతీహరీలోని జాంకీ సేవా సదన్ నర్సింగ్ హోమ్ లో నర్సుగా పని చేస్తున్న మహిళ హత్యాచారానికి గురైంది. ఈ దారుణానికి పాల్పడిన డాక్టర్, ఆసుపత్రి సిబ్బంది పరారీలో ఉన్నారు. కాగా, ఓ కాంపౌండర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు డాక్టర్ జైప్రకాశ్ దాస్ తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. నర్సింగ్ హోమ్ కి సీల్ వేశారు పోలీసులు.

మృతురాలి వయసు 30ఏళ్లు. భర్త చనిపోయాడు. ఆమెకి నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. డాక్టర్ జైప్రకాశ్ దాస్, మంతోశ్ కుమార్ కలిసి నర్సింగ్ హోమ్ ని నిర్వహించే వారని మృతురాలి తల్లి తెలిపారు.

Also Read..Shamshabad: శంషాబాద్ మహిళ హత్య కేసు.. ఆమెను తగులబెట్టింది మరో మహిళే.. ఎందుకంటే?

”భర్త చనిపోయాక నా కూతురు నాతోనే ఉంటోంది. మా పరిస్థితిని చూసిన డాక్టర్ జైప్రకాశ్, మంతోశ్ కుమార్ నన్ను సంప్రదించారు. వాళ్ల క్లినిక్ కి నా కూతురిని పంపాలని అడిగారు. ఆ విధంగా కాస్త డబ్బు వస్తుందని, ఇంటి అవసరాలు తీరతాయని వారు నాతో చెప్పారు. అప్పటికే ఉద్యోగం కోసం నా కూతురు ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో వారు అవకాశం ఇచ్చారు. దాంతో నా కూతురు వెంటనే ఒప్పుకుంది. వాళ్ల క్లినిక్ లో పని చేసేందుకు.

అయితే ఓ రోజు ఇంటికి వచ్చాక ఇక క్లినిక్ కి వెళ్లను అని నా కూతురు చెప్పింది. ఎందుకని ఆమె ప్రశ్నించగా, డాక్టర్, ఇతర సిబ్బంది చేస్తున్న పనులు అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పింది. అంతేకాదు వారు తనను వేధించారని వాపోయింది. ఆ తర్వాత నా కూతురు తిరిగి అక్కడికి రాలేదు. కొన్ని రోజుల తర్వాత జైప్రకాష్, మంతోష్ కుమార్ నా ఇంటికి వచ్చి క్షమాపణలు చెప్పారు. ఆసుపత్రిలో మంచి పరిస్థితులు కల్పిస్తామని, మంచి జీతం ఇస్తామని హామీ ఇస్తూ తిరిగి పనిలో చేరాలని నా కూతురిని కోరారు” అని మృతురాలి తల్లి చెప్పారు.

Also Read..Yogi : డూప్లికేట్ యోగి దారుణ హత్య.. తీవ్రంగా స్పందించిన అఖిలేశ్ యాదవ్, సత్వర న్యాయం చేయాలని డిమాండ్

”దాంతో నా కూతురు తిరిగి ఆసుపత్రిలో పని చేసేందుకు ఆగస్టు 8న వెళ్లింది. కానీ, తిరిగి ఇంటికి రాలేదు. ఆ తర్వాత తన కూతురి ఆరోగ్యం క్షీణించిందని, ఆమె ముజఫర్‌పూర్‌లో ఉందని డాక్టర్ జైప్రకాశ్ నాకు తెలియజేశారు. అయితే, అతను చెప్పిన ఆసుపత్రిలో నా కూతురు కనిపించలేదు. తీవ్రమైన గాలింపు తర్వాత అంబులెన్స్‌లో నా కుమార్తె మృతదేహాన్ని కనుగొన్నాము” అని మృతురాలి తల్లి కన్నీటిపర్యంతం అయ్యారు.

తల్లి వాంగ్మూలం ఆధారంగా డాక్టర్ సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఒకరిని అరెస్టు చేశారు. “మిగిలిన అనుమానితుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. టీమ్ యాక్టివ్‌గా ఉంది, ఈ కేసులో నిందితులందరినీ త్వరలో అరెస్టు చేస్తామని” మోతీహరి ఎస్పీ తెలిపారు.

డాక్టర్, ఆసుపత్రి సిబ్బంది కలిసి.. నర్సుని గ్యాంగ్ రేప్ చేసి మర్డర్ చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. మృతురాలి ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. తన కూతురిని నమ్మించి చంపేశారని తల్లి కన్నీటిపర్యంతం అయ్యింది. తన మనవడు అనాథగా మారాడని వాపోయింది. ఇప్పుడు తనకు దిక్కు ఎవరు అని ఆవేదన వ్యక్తం చేసింది. తన కూతురిని అత్యంత కిరాతకంగా చంపిన మృగాళ్లను కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు