Dmitry Glukhovsky : యుక్రెయిన్ పై దాడిని ఖండించిన రష్యా రచయితకు 8 ఏళ్లు జైలుశిక్ష

రష్యాలో ప్రముఖ ప్రతిపక్ష నేత, పుతిన్ విమర్శకుడు, అవినీతి వ్యతిరేక ప్రచారకర్త అయిన అలెక్సీ నావల్నీకి 19 ఏళ్లు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఉగ్రవాద ఆరోపణలపై సరైన ఆధారాలు లేకుండానే నావల్నీని రష్యా కోర్టు దోషిగా తేల్చడం గమనార్హం.

Dmitry Glukhovsky prison

Dmitry Glukhovsky Sentenced Prison : యుక్రెయిన్(Ukraine)పై రష్యా యుద్ధం (Russia War) చేస్తోన్న విషయం తెలిసిందే. యుక్రెయిన్ పై రష్యా దాడిని ఖండించిన ప్రముఖ సైన్స్ ఫిక్షన్ రచయిత దిమిత్రి అలెక్సీవిచ్ గ్లుఖోవ్ స్కీకి రష్యా కోర్టు(Russian court) జైలు శిక్ష విధించింది. గత నెలాఖరు(జులై)లో యుక్రెయిన్ రేపు పట్టణం ఒడెసాపై రష్యా సైన్యం దాడికి పాల్పడింది. ఈ సందర్భంగా దాడిని ఖండిస్తూ ‘Bi***es’ అనే క్యాప్షన్ తో ఒడెసాకు తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.

దీనిని తీవ్రమైన నేరంగా పరిగణించిన రష్యన్ కోర్టు దిమిత్రికి 8 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెల్లడించింది. ఇప్పటికే ఆయన్ను విదేశీ ఏజెంట్ అని ప్రకటించింది. కాగా, ఆగస్టు5న రష్యాలో ప్రముఖ ప్రతిపక్ష నేత, పుతిన్ విమర్శకుడు, అవినీతి వ్యతిరేక ప్రచారకర్త అయిన అలెక్సీ నావల్నీకి 19 ఏళ్లు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.

US Alabama Fight: నదిఒడ్డున ఫైటింగ్.. ఆడ, మగ తేడాలేకుండా కుర్చీలతో బాదుకున్నారు.. ఎందుకో తెలుసా? వీడియోలు వైరల్

ఉగ్రవాద ఆరోపణలపై సరైన ఆధారాలు లేకుండానే నావల్నీని రష్యా కోర్టు దోషిగా తేల్చడం గమనార్హం. వివిధ ఆరోపణలపై ఆయన ఇప్పటికే 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. దీనికి అదనంగా ఇప్పుడు ఆయనకు మరో 19 ఏళ్లు శిక్ష పడింది. అయితే అధ్యక్షుడు పుతిన్ కు వ్యతిరేకంగా వ్యవహరించేవారు ఏదో ఒక ఆరోపణపై జైలుకు వెళ్లడం రష్యాలో పరిపాటైంది.

ట్రెండింగ్ వార్తలు