Salman Khan Threat Letter : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపులు

సల్మాన్‌ఖాన్‌ తండ్రి సలీంఖాన్‌ ఉదయం జాగింగ్‌కు వెళ్లినప్పుడు అక్కడ బెంచ్‌పై కూర్చున్నప్పుడు అతడిని, అతని కొడుకు సల్మాన్‌ఖాన్‌ని బెదిరిస్తూ ఈ లేఖ కనిపించింది. పంజాబీ సింగర్‌ సిద్ధూ మూస్ వాలా లాగే సల్మాన్‌ను కూడా హతమారుస్తామని అగంతకులు లేఖలో బెదిరించారు.

Salman Khan threat letter : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ ఖాన్, అతని తండ్రి సలీంఖాన్‌ను చంపేస్తామంటూ అగంతకుడు లేఖ రాశాడు. పంజాబ్‌ సింగర్‌ సిద్ధూ మూసేవాలా లాగే సల్మాన్‌ను చంపేస్తామని ఈ లేఖలో బెదిరించారు. దీంతో సల్మాన్ ఖాన్ బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు లేఖ ఎవరు రాశారన్న విషయంపై ఆరా తీస్తున్నారు.

సల్మాన్‌ఖాన్‌ తండ్రి సలీంఖాన్‌ ఉదయం జాగింగ్‌కు వెళ్లినప్పుడు అక్కడ బెంచ్‌పై కూర్చున్నప్పుడు అతడిని, అతని కొడుకు సల్మాన్‌ఖాన్‌ని బెదిరిస్తూ ఈ లేఖ కనిపించింది. పంజాబీ సింగర్‌ సిద్ధూ మూస్ వాలా లాగే సల్మాన్‌ను కూడా హతమారుస్తామని అగంతకులు లేఖలో బెదిరించారు. ఉదయం 7:30 నుంచి 8:00 గంటల సమయంలో సలీంఖాన్‌కు లేఖ అందింది. సమాచారం అందుకున్న బాంద్రా పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Salman Khan : సింగర్ సిద్దూ హత్యతో సల్మాన్ ఖాన్‌కి సెక్యూరిటీ పెంపు..

ఇటీవలే పంజాబీ సింగర్‌ సిద్ధూ హత్యతో సల్మాన్ ఖాన్ కు కూడా ముంబై పోలీసులు భద్రతను పెంచారు. ఇక ఈ హత్యలో ప్రధాన నిందితుడు గ్యాంగ్‌స్టార్‌ లారెన్స్‌ బిష్టోయ్‌ అన్న సంగతి తెలిసిందే. ఇదే సమంయలో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ ప్రమేయం ఉన్నందున సల్మాన్ ను హత్య చేస్తానని గతంలో బిష్ణోయ్‌ ఓ సందర్భంలో బెదిరించాడు.

ఈక్రమంలో సల్మాన్ ఖాన్ హత్యకు సంబంధించి రెక్కీ నిర్వహించేందుకు ముంబైకి వెళ్లాడని పోలీసులు కనుగొన్నారు. 2020లో జరిగిన ఒక హత్య కేసులో బిష్ణోయ్ సహచరుడు రాహుల్ అలియాస్ సన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారిస్తున్న సమయంలో సల్మాన్ ను చంపబోతున్నామరి పోలీసులకు తెలిపాడు. దీంతో సల్మాన్‌ భద్రతను కట్టుదిట్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు