Crime News: భార్యకు వీడియోకాల్ చేసి లైవ్‌లోనే ఆత్మహత్య చేసుకున్న భర్త.. అసలేం జరిగిందంటే..

భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణమే. కానీ కొందరు వాటిని మరీ సీరియస్ గా తీసుకొని తమ ప్రాణాలను తీసుకుంటూ కటుంబాలను అనాథలుగా మార్చేస్తున్న ఘటనలు చూస్తున్నాం. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ తురక్కగూడ లో చోటు చేసుకుంది.

Crime News: భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణమే. కానీ కొందరు వాటిని మరీ సీరియస్ గా తీసుకొని తమ ప్రాణాలను తీసుకుంటూ కటుంబాలను అనాథలుగా మార్చేస్తున్న ఘటనలు చూస్తున్నాం. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ తురక్కగూడ లో చోటు చేసుకుంది. భార్య ఆమె బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి తన బంధువుల ఇంట్లో జరిగే కార్యక్రమానికి రావడం లేదని మనస్థాపం చెందిన ఓ భర్త క్షణికావేశానికి గురై ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న కారణానికి తన ప్రాణాలను పోగొట్టుకోవటంతో పాటు కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చాడు.

Crime News: జిమ్ ట్రైన‌ర్‌తో వివాహిత అక్ర‌మ సంబంధం.. అడ్డొస్తున్నాడ‌ని భ‌ర్త‌ను దారుణంగా.

తుక్కుగూడకు చెందిన సాయి కార్తీక్ గౌడ్ (33) భార్య రవళితో కలిసి ఈనెల 12న ఆమె బంధువుల ఇంట్లో జరిగే వివాహం కోసం కందుకూరు మండలంలోని బేగంపేట వెళ్లాడు. కార్యక్రమం అనంతరం భార్యను అక్కడే వదిలేసి శనివారం సాయి కార్తీక్ ఒక్కడే తక్కుగూడకు వచ్చాడు. సాయి కార్తీక్ పిన్ని ఇంటిలో ఆదివారం బోనాల పండుగ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంకు వెళ్లాలని, వెంటనే రావాలని కార్తీక్ భార్య రవళిని అనేకసార్లు ఫోన్ చేసి అడిగాడు. అయినా ఆమె ససేమీరా అనడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

AP Government: ఉపాధ్యాయులకు తిప్పలే..! ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆబ్సెంట్.. ఏపీలో టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ విధానం

ఆదివారం ఉదయాన్నే మళ్లీ ఫోన్ చేసి వెంటనే బయలుదేరి రావాలని రవళికి సూచించినప్పటికీ అందుకు ఆమె ఒప్పుకోలేదు. మీ తరపు వారి అన్ని ఫంక్షన్లకు నేను వస్తున్నా, మా వాళ్ల ఫంక్షన్లకు మాత్రం నువ్వు ఎందుకు రావడం లేదంటూ భార్యను నిలదీశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రవళి రానని చెప్పడంతో.. ఆదివారం మధ్యాహ్నం కార్తీక్ భార్యకు వీడియో కాల్ చేసి మాట్లాడుతూనే దూలానికి ఉరివేసుకున్నాడు. భర్త చేసిన పనితో ఒక్కసారిగా కంగుతిన్న భార్య చుట్టుపక్కల వారికి ఫోన్ చేసి తన భర్తను కాపాడాలని వేడుకుంది. ఆమె సైతం వెంటనే తక్కుగూడెం బయలుదేరింది. కానీ రవళి ఇంటికి వచ్చేలోపే కార్తీక్ మృతి చెందడంతో బోరుమని విలపించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు