నవనీత్ రవి రాణా, అసదుద్దీన్ ఒవైసీ మధ్య మాటల యుద్ధం

మీకు 15 నిమిషాలు పట్టొచ్చేమో, కానీ మాకు 15 సెకన్లే చాలని నేను అతడితో చెప్పాలనుకుంటున్నా.

Navnit Ravi Rana versus Asaduddin Owaisi: హైదరాబాద్ లోక్‌స‌భ‌ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, ఎంఐఎం నాయకుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇరు పార్టీల నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఓట్ల వేట సాగిస్తున్నారు. నువ్వు ఒకటి అంటే నేను రెండు అంట అన్నట్టుగా మాటల యుద్ధం చేస్తున్నారు. తాజాగా ఒకప్పటి సినీ నటి నవనీత్ రవి రాణా చేసిన వ్యాఖ్యలు హీట్ రేపుతున్నాయి. మహారాష్ట్రలోని అమరావతి ఎంపీగా ఉన్న ఆమె బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారం సాగించారు. యువ మోర్చా సమావేశంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

15 నిమిషాలు పోలీసులు లేకుండా ఉంటే మా తడాఖా ఏమిటో చూపిస్తామని గతంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. మాకు 15 సెకన్లు చాలు అంటూ కౌంటర్ ఇచ్చారు. ”పోలీసులను 15 నిమిషాలు తప్పుకోమనండి, మేము ఏమి చేయగలమో చూపిస్తామని అసదుద్దీన్ తమ్ముడు చెప్పాడు. మీకు 15 నిమిషాలు పట్టొచ్చేమో, కానీ మాకు 15 సెకన్లే చాలని నేను అతడితో చెప్పాలనుకుంటున్నా. ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేస్తే పాకిస్థాన్ కు వేసినట్టేన”ని నవనీత్ రవి రాణా వ్యాఖ్యానించారు. 39 సెకన్ల ఈ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసి అక్బరుద్దీన్ ఒవైసీకి కు ట్యాగ్ చేశారు.

 

నవనీత్ రవి రాణా వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మీరు చెప్పినట్టే కానీయండి అంటూ సవాల్ విసిరారు. ”నేను (ప్రధాని నరేంద్ర) మోదీజీ చెబుతున్నాను. ఆమెకు 15 సెకన్లు ఇవ్వండి. ఆమె ఏమి చేస్తుందో చేయనీయండి. అవసరమైతే ఆమెకు ఒక గంట సమయం ఇవ్వండి. వారు ఏమి చేస్తారో మేము చూడాలనుకుంటున్నాం. వారిలో మానవత్వం మిగిలి ఉందా? ఎవరు భయపడతారు? మేం సిద్ధంగా ఉన్నాం.. ఎవరైనా ఓపెన్ కాల్ చేస్తే (ఇలా) అలాగే ఉంటాం. మీరు అనుకున్నది చేయండి. మిమ్మల్ని ఆపేదెవరు?” అని మీడియాతో ఒవైసీ అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు