Truck Catches Fire : రైల్వే విద్యుత్ వైరు తగిలి ట్రక్కుకు అంటుకున్న మంటలు… 49 గంటల పాటు నిలిచిన రైళ్లు

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సక్రేలి గేట్ సమీపంలో ఓ ట్రక్కు హైటెన్షన్ రైల్వే విద్యుత్ లైన్‌ను తాకడంతో మంటలు చెలరేగాయి. ఓవర్‌లోడ్ తో వస్తున్న ట్రక్కుకు రైల్వే ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్ వైర్‌ తాకింది. దాని కారణంగా ట్రక్కులో మంటలు చెలరేగాయి....

Truck Catches Fire

Truck Catches Fire : ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సక్రేలి గేట్ సమీపంలో ఓ ట్రక్కు హైటెన్షన్ రైల్వే విద్యుత్ లైన్‌ను తాకడంతో మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన తర్వాత పోలీసులు, అగ్నిమాపక దళం వచ్చి మంటలను ఆర్పారు. ఓవర్‌లోడ్ తో వస్తున్న ట్రక్కుకు రైల్వే ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్ వైర్‌ తాకింది. దాని కారణంగా ట్రక్కులో మంటలు చెలరేగాయి. (Railway Power Line In Chhattisgarh) ఈ ప్రమాదం కారణంగా రైల్వే ట్రాక్ (ముంబయి హౌరా రైలు మార్గం) జాతీయ రహదారిలో 49 గంటల తరబడి రైళ్లు, వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మంటలను ఆర్పివేసి, జేసీబీ వాహనం ద్వారా ట్రక్కును బయటకు తీసిన తర్వాతే వాహనాల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా ఆజాద్ హింద్ ఎక్స్‌ప్రెస్ బరద్వార్ స్టేషన్‌లో గంటల తరబడి నిలిచిపోయింది. జనశతాబ్ది, ఇతర ప్యాసింజర్ రైళ్లు చంపా, శక్తి స్టేషన్లలో నిలిచాయి. 49 గంటల తర్వాత రైళ్లు యధావిధిగా నడిచాయి.

ట్రెండింగ్ వార్తలు