Encounter : మధ్యప్రదేశ్ బాలాఘాట్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

గత కొన్ని దశాబ్దాలుగా బాలాఘాట్ లో మావోయిస్టులు క్రియాశీలక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడ శాంతి భద్రతలను కాపాడటం పోలీసులకు సమస్యగా మారింది. దీంతో మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతంలో తరచూ తనిఖీ నిర్వహిస్తున్నారు.

Encounter : మధ్యప్రదేశ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బాలాఘాట్ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. శనివారం (ఏప్రిల్ 22,2023)న తెల్లవారుజామున బాలాఘాట్ లోని కాడ్లా అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.

ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మరణించారు. మృతి చెందిన మావోయిస్టులు ఏరియా కమిటీ మెంబర్, భోరందేవ్ కమిటీ కమాండర్ సునీత, ఏరియా కమిటీ మెంబర్ సరితా ఖాటియా మోచాగా గుర్తించారు. అయితే, ఇద్దరి తలలపై రూ.14లక్షల చొప్పున రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో తుపాకులు, కాట్రిజ్ లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు.

Encounter In Chhattisgarh : ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులకు తీవ్ర గాయాలు

గత కొన్ని దశాబ్దాలుగా బాలాఘాట్ లో మావోయిస్టులు క్రియాశీలక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడ శాంతి భద్రతలను కాపాడటం పోలీసులకు సమస్యగా మారింది. దీంతో మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతంలో తరచూ తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గతేడాది ఆరుగురు మావోయిస్టులను ఎన్ కౌంటర్ చేశారు. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు.

ట్రెండింగ్ వార్తలు