Massage Centers : మసాజ్ సెంటర్ల మాఫియాకు యువకుడు బలి

విజయవాడలో మసాజ్‌ సెంటర్‌ మాటున.. ఘాటైన ఆగడాలు పెరిగిపోతున్నాయి. మసాజ్ మాఫియా వేధింపులు తాళలేక ఒక యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

Massage Centers :  విజయవాడలో మసాజ్‌ సెంటర్‌ మాటున.. ఘాటైన ఆగడాలు పెరిగిపోతున్నాయి. మసాజ్ మాఫియా వేధింపులు తాళలేక ఒక యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  ముందు అమ్మాయిల పేరుతో ఊరిస్తారు.. తర్వాత భయం లేదంటూ భరోసా ఇస్తారు.. తీరా వెళ్లాక చీకట్లో చిందులను సీసీ కెమెరాల్లో బంధిస్తారు.. అంతా ఒకే అనుకుంటున్న సమయంలో .. సెల్‌ఫోన్‌ వాట్సాప్‌కి  వీడియో సెండ్‌ చేస్తారు.

ఇక వాళ్లు చెప్పింది చేస్తే ఓకే.. లేదంటే సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తామంటూ బెదిరిస్తారు. కొందరు భయంతో వాళ్లు చెప్పినట్లు చేస్తుంటే.. మరికొందరు ఎవరికి చెప్పుకోవాలో.. ఏం చేయాలో తెలియక .. వీరి టార్చర్‌కు సూసైడ్‌ చేసుకుంటున్నారు. విజయవాడలో మసాజ్‌ సెంటర్ల నిర్వాహకుల ఆగడాలకు.. ఇప్పుడు ఎందరో యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఒకప్పుడు ముంబై.. హైదరాబాద్‌ నగరాలకే పరిమితమైన మసాజ్‌ సెంటర్ల ఆగడాలు .. ఇప్పుడు విజయవాడనూ కిక్కెక్కిస్తున్నాయి. గల్లీ గల్లీకి ఈ గలీజ్‌ దందా కామన్‌ అయిపోయింది. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన శ్రీకాంత్ రెడ్డిని .. మసాజ్ సెంటర్స్ ప్రతినిధులు చిత్రహింసలకు గురి చేశారు. రిలాక్సేషన్‌ కోసం హెడ్‌మసాజ్‌.. బాడీ మసాజ్‌ కోసం లోపలకు వెళ్లిన శ్రీకాంత్‌రెడ్డికి.. అమ్మాయిలతో వలవేశారు. వాళ్లు అతన్ని మాటలతో మాయచేసి.. అందంతో కైపెక్కించారు.

తర్వాత మసాజ్‌ మాటున రాసలీలలకు తెరదీశారు. అతను మగువల కౌగిట్లో బందీ అవ్వగానే.. సీక్రెట్‌గా సీసీ కెమెరాల్లో బంధించారు. ఈ వ్యవహారం గురించి తెలియని శ్రీకాంత్‌రెడ్డి .. నిర్వాహకుల గాలానికి చిక్కాడు. మసాజ్ సెంటర్‌లో పనిపూర్తికాగానే .. ఇంటికివెళ్లి రిలాక్స్‌ అవుతున్న సమయంలో .. అతని వాట్సాప్‌ మెసేజ్‌కు రాసలీలల వీడియోలను పంపించి .. బెదిరించారు. ఈ మెసేజ్‌లు ఇక్కడితో ఆగిపోవాలంటే .. డబ్బులు ముట్టజెప్పాలంటూ అతన్ని బెదిరించారు. లేదంటే వీడియోలను కుటుంబ సభ్యులకు, బంధువులకు పంపించడమే కాకుండా .. సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ చేస్తామంటూ భయపెట్టారు.

అయితే తన వద్ద డబ్బులు లేవని ఎంత ప్రాధేయపడినా… వాళ్లు కనికరించలేదు. దీంతో చేసేది లేక చివరకు శ్రీకాంత్‌ రెడ్డి సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఆత్మహత్యకు ముందు .. జరిగినదంతా సెల్ఫీ వీడియో తీశాడు. ఇదిలా ఉంటే… విజయవాడ నగరంలో మసాజ్ సెంటర్స్‌లో జరుగుతున్న ఘటనలపై పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్లనే… మసాజ్ సెంటర్స్ మాటున మాయలీలలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులు మాసాజ్ సెంటర్స్ పై నిఘా పెంచాలని నగర వాసులు కొరుతున్నారు.

Also Read : Drugs : గోవా నుంచి డ్రగ్స్ తెస్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అరెస్ట్

ట్రెండింగ్ వార్తలు