Respiratory Infections : వర్షాకాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి 5 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ !

తేనె సహజమైన క్రిమినాశిని. ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల చికిత్సలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఒక కప్పు గోరువెచ్చని నీరు లేదంటే టీలో ఒక చెంచా తేనె వేసి రోజుకు రెండుసార్లు త్రాగాలి.

Respiratory Infections

Respiratory Infections : రుతుపవనాలు వచ్చేశాయి. దానితో పాటు శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ల ముప్పు పొంచి ఉండే ప్రమాదం ఉంది. జలుబు , ఫ్లూ , బ్రోన్కైటిస్ , ఆస్తమా ఇవ్వన్నీ బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగినవారిని వర్షాకాలంలో చుట్టుముట్టేస్తాయి. అయితే ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. శ్వాసకోశ వ్యవస్థను ఆరోగ్యంగా , ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుకోవటానికి అనేక సాధారణ గృహ నివారణలు ఎంతగానో తోడ్పడతాయి.

READ ALSO : Fatty Liver Disease : శరీర భాగాల్లో ఈ 5 ప్రదేశాల్లో వాపు వస్తే అది ఫ్యాటీ లివర్ వ్యాధికి సంకేతమా !

వర్షాకాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌లను అరికట్టడానికి నివారణలు ;

పసుపు: శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌లకు అత్యంత పురాతనమైన ఇంటి నివారణలలో పసుపు ఒకటి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి, ఇది జలుబు, దగ్గు, బ్రోన్కైటిస్, ఉబ్బసం చికిత్సకు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఇంట్లో పసుపు నివారణను తయారు చేయడానికి, ఒక టీస్పూన్ పసుపు పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని పాలు లేదంటే నీటితో కలిపి రోజుకు రెండుసార్లు త్రాగాలి. అవసరమైతే ఈ మిశ్రమానికి అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు.

READ ALSO : Amla Juice : శీతాకాలంలో వ్యాధులు దరిచేరకుండా రక్షించే ఉసిరికాయ జ్యూస్!

తేనె : తేనె సహజమైన క్రిమినాశిని. ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల చికిత్సలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఒక కప్పు గోరువెచ్చని నీరు లేదంటే టీలో ఒక చెంచా తేనె వేసి రోజుకు రెండుసార్లు త్రాగాలి.

READ ALSO : Mangosteen Fruit : పోషకాలతో నిండిన ఉన్న మాంగోస్టీన్ పండు! ఈ పండు తింటే దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరవు తెలుసా?

ఆవిరిని పీల్చుకోవటం : ఆవిరిని పీల్చడం అనేది శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లకు సమర్థవంతమైన పరిష్కారం. ఇది కఫం ,నాసికా భాగాలను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. ఇంట్లో ఆవిరి పీల్చడానికి ఒక గిన్నెలో కొంత నీటిని మరిగించి, ముఖం మరియు తల నేరుగా గిన్నెపై ఉండేలా చేసి దుప్పటితో తలభాగాన్ని కప్పి ఉంచాలి. నోటి ద్వారా 10 నిమిషాలు శ్వాస తీసుకోవాలి.

READ ALSO : Gum Disease : పంటి చిగుర్ల వ్యాధులు ఎలా వస్తాయ్? చిగుర్లు ఆరోగ్యంగా ఉండాలంటే?

హైడ్రేటెడ్‌గా ఉండటం: వర్షాకాలంలో హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది నాసికా భాగాలను క్లీయర్ గా ఉంచుతుంది. శరీరం ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడడాన్ని సులభతరం చేస్తుంది. రోజంతా నీరు పుష్కలంగా త్రాగాలి. అలాగే మూలికా టీలు , పండ్ల రసాలు వంటి ఇతర ద్రవాలను తీసుకోవాలి.

READ ALSO : వేసవిలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చల్లిని ఫుడ్స్‌ను నివారించండి: ఐస్ క్రీం , కూల్ డ్రింక్స్ వంటి చల్లని ఆహారాలు తినడం వల్ల నాసికా భాగాలలో రద్దీ పెరుగుతుంది. వైరస్‌లు, బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం వల్ల ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుంది. వర్షాకాలంలో చల్లని ఆహారాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. వాటికి బదులుగా వెచ్చని సూప్‌లు, హెర్బల్ టీలను ఎంచుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు