Blood Donation : రక్తదానం సురక్షితమేనా? మనం ఎన్నిరోజులకొకసారి రక్తదానం చేయవచ్చు?

రక్తదానం తర్వాత కొద్దిరోజులకు మరలా రక్తదానం చేయడం సురక్షితం. కొంతమంది శతాధిక రక్తదాతలు ఉంటారు. తమ జీవితకాలంలో 100 కంటే ఎక్కువ సార్లు రక్తదానం చేసినవారు అన్నమాట. అలాంటి వారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు. కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు దీని నిరూపించాయి.

donating blood

Blood Donation : అత్యవసర సమయంలో ప్రాణాలు నిలిపేందుకు రక్తదానం అనేది ఎంతగానో తోడ్పడుతుంది. రక్తదానం వల్ల ఎదుటివారి ప్రాణాలు నిలబడటమే కాకుండా దాతలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. రక్తదానం చేయటం అన్నది ఎంతవరకు సురక్షితమైనది, మనం ఎంత తరచుగా రక్తాన్ని దానం చేయవచ్చు అనే విషయంలో చాలా మందిలో అనేక సందేహాలు ఉన్నాయి.

READ ALSO : Diabetes and headaches : తలనొప్పి అనేది రక్తంలో చక్కెర ఎక్కువ లేదా తక్కువగా ఉన్నప్పుడు కనిపించే లక్షణమా?

రక్తదానం అన్నది సురక్షితమైన ప్రక్రియ. కొత్త, స్టెరైల్ డిస్పోజబుల్ బ్లడ్ బ్యాగ్‌లు , కిట్‌లు, అసెప్టిక్ పద్ధతులను అనుసరించి రక్త సేకరణ జరుగుతుంది. అందువలన, దాన ప్రక్రియలో అంటువ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉండదు. రక్తదాత రక్తదానం కోసం వచ్చిన ప్రతిసారీ, వారి ఆరోగ్యం గురించి నిర్ధారించుకునేందుకు మినీ హెల్త్ చెకప్ చేయాల్సి ఉంటుంది. అంటే రక్తం దానం ఇవ్వడానికి వారి ఫిట్‌నెస్ చెకప్ అన్నమాట. ఈ చెక్-అప్ అధిక రక్తపోటు , గుండె అరిథ్మియా వంటి పరిస్ధితుల్లో ఉన్నా, లేదంటే వారికి తెలియని అంటు వ్యాధులతో బాధపడుతున్నా ఈ పరీక్షల్లో నిర్ధారణ అయితే వారు చికిత్స పొందేందుకు అవకాశం ఉంటుంది.

దాతకు సంబంధించిన రక్తం ఏ గ్రూపుకు చెందినదో తెలుసుకోవచ్చు. జీవితంలో ఏ సమయంలోనైనా వారు శస్త్రచికిత్స , రక్తమార్పిడి అవసరమయ్యే వైద్య పరిస్థితిని ఎదుర్కొంటే ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటుంది. ముందస్తు గా రక్తం గ్రూపును తెలుసుకుని ఉండటం వల్ల కీలకమైన సమయం ఆదా అవుతుంది. చాలా మంది ఆరోగ్యవంతులైన పెద్దలు 350 నుండి 450 ml రక్తాన్ని దానం చేయవచ్చు. దీనివల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదు.

READ ALSO : Kadwa Badam : రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి దోహదపడే కద్వా బాదం !

రక్తదానం చేసిన కొద్దిరోజుల్లోనే శరీరం కోల్పోయిన ద్రవాలను భర్తీ చేస్తుంది. దాతలు కాని వారితో పోలిస్తే రక్త దానం చేసేవారిలో చెడు కొలెస్ట్రాల్ (LDL) మరియు ట్రైగ్లిజరైడ్స్ తక్కువగా ఉంటాయి. రక్తదానం చేసే వ్యక్తులు రక్తపోటు, హిమోగ్లోబిన్, ఐరన్ స్థాయిలను దాతలు కాని వారి కంటే సమర్ధవంతంగా నిర్వహించగలుగుతారు. రక్తం గడ్డకట్టడం, గుండెపోటు, పక్షవాతం ఏర్పడటంతో సంబంధం ఉన్నపరిస్ధితులను తగ్గించుకోవచ్చు.

ఒకరి రక్తదానం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుంది. క్రమం తప్పకుండా దానం చేసే వ్యక్తులు తాము ఇతరులకు సహాయం చేస్తున్నామని సంతోషంగా ఉంటారు. పరోపకారం , స్వచ్ఛంద సేవ సానుకూల ఆరోగ్య ఫలితాలతో ముడిపడి ఉంటుంది. నిరాశను తొలగించి ఎక్కువ దీర్ఘాయువునిస్తుంది.

READ ALSO : Control Blood Sugar Levels : రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి తోడ్పడే పానీయాలు !

మన శరీరంలో ఎంత రక్తం ఉంటుంది, దానం చేసినప్పుడు ఎంత తీసుకుంటారు ;

ప్రతి ఒక్కరిలో 4-5 లీటర్ల రక్తం ఉంటుంది. 50-55 కిలోల బరువున్న పెద్దవారి రక్తప్రసరణలో 4-5 లీటర్ల రక్తం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దాన సమయంలో తీసుకునేది 350 మి.లీ., ఒక వ్యక్తి 55 కిలోల కంటే తక్కువ కానీ అంతకంటే ఎక్కువ బరువు ఉంటే. 45 కిలోల కంటే ఎక్కువ శరీర బరువు లేదా 55 కిలోల కంటే ఎక్కువ ఉంటే 450 ml తీసుకుంటారు. ఇది మొత్తం మన వద్ద ఉన్న రక్తంలో 10% కంటే తక్కువకు సమానం.

దీని వల్ల బలహీనత లేదా ఏదైనా లోపం ఏర్పడే సమస్య ఉత్పన్నంకాదు. రక్తదానం తర్వాత కొద్దిరోజులకు మరలా రక్తదానం చేయడం సురక్షితం. కొంతమంది శతాధిక రక్తదాతలు ఉంటారు. తమ జీవితకాలంలో 100 కంటే ఎక్కువ సార్లు రక్తదానం చేసినవారు అన్నమాట. అలాంటి వారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు. కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు దీనిని నిరూపించాయి. రక్తదానం వల్ల పాత రక్త కణాలను కొత్తగా ఉత్పత్తి చేయబడిన ఎర్ర కణాలతో భర్తీ చేయడానికి సహాయపడుతుంది. రక్తదాతల్లో గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. రక్తదాతలలో వృద్ధాప్య ప్రక్రియ నెమ్మదిస్తుంది.

READ ALSO : High Blood Sugar: రక్తంలో చక్కెర స్థాయి పెరిగిందన్న విషయాన్ని తెలిపే 15 లక్షణాలు

భద్రతా కోణంలో చూస్తే రక్తాన్ని ఎక్కడ దానం చేయాలి అనేది కూడా ముఖ్యమైనది. ఆసుపత్రి ఆధారిత రక్త కేంద్రంలో రక్తదానం చేయడం ఎల్లప్పుడూ సురక్షితం. తొలసారి రక్తదానం చేస్తున్నప్పుడు రక్తదాన శిబిరాల్లో కాకుండా ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ లో రక్త దానం చేయాలి. ఎందుకంటే ఆసమయంలో ఎలాంటి అత్యవసర పరిస్దితి ఎదురైనా చికిత్స అందించేందుకు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, మగ వారు ప్రతి మూడు నెలలకు (90 రోజులకు), ఆడవారు ప్రతి నాలుగు నెలలకు (120 రోజులకు) రక్తాన్ని దానం చేయవచ్చు. అయితే ప్లేట్‌లెట్స్ దానం చాలా తరచుగా చేయవచ్చు. 48 గంటలు అనగా వారానికి 2 సార్లు మించకూడదు. ఒక సంవత్సరంలో 24 సార్లకి పరిమితం చేయాలి. క్రమం తప్పకుండా రక్తదానం చేయడం అలవాటు చేసుకోవటం తోపాటు ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాలను నిలిపేందుకు రక్త దానం చేసేలా మన చుట్టు ఉన్న వారిని ప్రోత్సహించాలి.

READ ALSO : High Blood Sugar : రక్తంలో అధిక చక్కెర లెవెల్స్ శరీరంలోని ఏయే భాగాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటే?

ఇదిలా ఉంటే భారతదేశంలో, మన జనాభా ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మగ మరియు ఆడ దాతలకు వేర్వేరు ప్రమాణాలు ఉన్నాయి. భారతదేశంలో, ఒక మహిళా దాత ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. , అంటే సంవత్సరంలో మూడు సార్లు, ఒక పురుష దాత ప్రతి మూడు నెలలకు, అంటే సంవత్సరానికి నాలుగు సార్లు రక్తదానం చేయవచ్చు. సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్స్ లేదా ప్లేట్‌లెట్ డొనేషన్ విషయానికి వస్తే, ప్రమాణాలు భిన్నంగా ఉంటాయి. ఒక వ్యక్తి సంవత్సరానికి 24 సార్లు ప్లేట్‌లెట్స్ లేదా ప్లాస్మాను దానం చేయవచ్చు, ఇది సురక్షితమైనది.

ట్రెండింగ్ వార్తలు