Overcome Stress : ఒత్తిడిని అధిగమించడానికి , పొగాకు వాడకాన్ని నివారించడానికి చిట్కాలు !

ఒత్తిడి అనేది వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా, వృత్తిపరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచి ఆహార ఎంపికలు, శారీరక శ్రమతో కూడిన సమతుల్య జీవనశైలి వల్ల దాని నుండి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడిని ప్రేరేపించే పరిస్థితులను గుర్తించడం , తద్వారా పొగాకు వినియోగాన్ని గుర్తించడం చాలా ముఖ్యం.

Overcome Stress : కొన్ని నివేదికల ప్రకారం, పొగాకు ప్రతి సంవత్సరం 8 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయేలా చేస్తుంది. వీరిలో ధూమపానం చేసేవారు, పొగాకు ఉత్పత్తులను వివిధ రూపాల్లో వినియోగించేవారు, పొగకు గురైన వారు కూడా ఉన్నారు. చాలా మందిలో ఉరుకుల పరుగుల జీవితం ఒత్తిడి స్థాయిలను పెంచుతుంది. దీని వల్ల వారు అనారోగ్యకరమైన అలవాట్లకు లోనుకావటానికి దారితీస్తుంది. ఇలాంటి అలవాట్లలో ప్రధానమైనది ధూమపానం.

READ ALSO : Foods to Help Fight Stress : ఒత్తిడికి గురైనప్పుడు తీసుకోవాల్సి ముఖ్యమైన 5 ఆహారాలు ఇవే ?

ఒత్తిడి అనేది వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా, వృత్తిపరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచి ఆహార ఎంపికలు, శారీరక శ్రమతో కూడిన సమతుల్య జీవనశైలి వల్ల దాని నుండి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడిని ప్రేరేపించే పరిస్థితులను గుర్తించడం , తద్వారా పొగాకు వినియోగాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. లోతైన శ్వాస వ్యాయామాలు, నడక, మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్‌లను అనుసరించాలి. ఈ అలవాటు నుండి దృష్టిని మళ్లించటం ద్వారా ఒత్తిడి నుండి బయటపడవచ్చు.

ఒత్తిడి అనేది మీ దైనందిన జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. వృత్తిపరమైన ఒత్తిడి ఎదుర్కొంటుంటే సహచరుల సహాయం తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడకండి. ఆరోగ్య సంరక్షణ నిపుణులు, మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించటం ద్వారా ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొనే మార్గాలను అనుసరించండి. అలాగని ఒత్తిడి ఎదుర్కొనే ప్రయత్నాల్లో పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని వ్యసనంగా చేసుకోవద్దు. దీని వల్ల దుష్పలితాలు కలుగుతాయి.

READ ALSO : Relax After Stressful : ఒత్తిడి అధికంగా ఉన్న రోజు తర్వాత ఉపశమనం పొందడానికి 5 మార్గాలు !

ఒత్తిడిని తగ్గించుకోవటం అనేది అవసరమే. అయితే దానికి పొగాకు వినియోగం ఏమాత్రం పరిష్కారం కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. పొగాకు ఉత్పత్తులను వినియోగించని వారు
ఆరోగ్యకరంగా ఉంటారు.

ఒత్తిడిని అధిగమించడానికి చిట్కాలు :

1.లోతైన శ్వాస, ధ్యానం , యోగా వంటి పద్ధతులను అనుసరించాలి.

2. రోజువారిగా శారీరక శ్రమ చేయాలి. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరిచే ఎండార్ఫిన్‌లను విడుదల చేయడంలో సహాయపడుతుంది.

3. ఆఫీసు పని, రొటీన్ కార్యకలాపాల నుండి కొంత విరామం తీసుకుని ఆనందంగా గడిపే కార్యకలాపాలకు సమయాన్ని కేటాయించాలి.

READ ALSO : Digital Eye Pressure : డిజిటల్ కంటి ఒత్తిడి అంటే ఏమిటి ? దీని నుండి కళ్ళను రక్షించుకోవడానికి చిట్కాలు

4. ఒత్తిడిని తగ్గించటంలో సన్నిహితులు, స్నేహితుల మద్ధతు తీసుకోవటం అనేది కీలకం. కాబట్టి స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి గడపటంతోపాటు, మీ కష్టాలను వారితో
పంచుకుని వాటికి పరిష్కారాలను వెతకండి.

5. ఒత్తిడి మీ రోజువారీ పనితీరును ప్రభావితం చేస్తుంటే మాత్రం వెంటనే నిపుణులను సంప్రదించి వారి నుండి తగిన వైద్య సహాయం పొందాలి.

పొగాకు వినియోగాన్ని నివారించడానికి కొన్ని సూచనలు ;

READ ALSO : Cupping Therapy : నొప్పి, వాపు , కండరాల ఒత్తిడిని తగ్గించటంతోపాటు రక్త ప్రసరణను ప్రోత్సహించే కప్పింగ్ థెరపీ !

1. ధూమపానం మానేయాలని దృఢంగా నిర్ణయించుకుని దానికి కట్టుబడి ఉండాలి.

2. ధూమపానం అలవాటును మానుకోవటానికి అవసరమైతే నిపుణులను సంప్రదించి వారి నుండి సూచనలు తీసుకోండి.

3. ఇతరులకు ధూమపానం అలావాటు ఉంటే అదే అలవాటును మీరు కొనసాగించకుండా ఉండేందుకు వారికి దూరంగా ఉండండి. ఈ అలవాటు వల్ల కలిగే దుష్పప్రభావాల గురించి వారికి
తెలియజెప్పే ప్రయత్నం చేయండి.

ట్రెండింగ్ వార్తలు