అలా చెబితే వాళ్లు నన్ను కొడ్తారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫన్నీ కామెంట్స్

పోలీసులు, ఆర్టీవో అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏది అని అడిగితే.. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పొద్దు. అలా చెబితే వాళ్లు నన్ను కొడ్తారు, తిడ్తారు.

Pithapuram MLA Gari Taluka Number Plates : పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ నెంబర్ ప్లేట్లు రాయించిన ఫ్యాన్స్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక విజ్ఞప్తి చేశారు. చెడ్డ పేరు తీసుకురాకండి, నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోకండి అని సూచించారు. ‘పోలీసులు, ఆర్టీవో అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏది అని అడిగితే.. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పొద్దు. అలా చెబితే వాళ్లు నన్ను కొడ్తారు, తిడ్తారు. అలాగే వన్ వేలో వెళ్లిపోతా.. ఏంటిది అని అడిగితే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పకండి. అందరూ చట్టాలు పాటించాలి అని చెప్పే స్థితిలో ఉన్న మనం కూడా చట్టాలు పాటించాల్సిందే.

సరదా, హుషారుగా ఉండండి కానీ నిబంధనలు పాటించండి. కావాలంటే నాకు రెండెకల స్థలం ఉంది. అక్కడికి వచ్చి బైకేసుకుని తిరగండి. మీకోసం కావాలంటే బైకు రేసు పెడతాను. హెల్మైట్లు పెట్టుకుని, బాడీ ఆర్మర్ ఇచ్చి మీరు తిరగండి. మీరు బాగుండాలనే కదా మేమందరం చేసేది. మీరు ఆరోగ్యంగా ఆయురాగ్యంతో ఉండాలి. చిన్న పిల్లలు అందరికీ ఉన్నతమైన జీవితం ఉండాలి. వచ్చే తరం కోసం పనిచేస్తున్నామ”ని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. తన సినిమాల గురించి కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాగా, పవన్ కల్యాణ్ గెలిచిన తర్వాత బైకులు, కార్లు, ఇతర వాహనాలకు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ జనసైనికులు నెంబర్ ప్లేట్లు తగిలించుకుని తిరుగుతున్నారు. ఇదే ట్రెండ్ మిగతా నియోజకవర్గాలకూ పాకింది. దీంతో పవన్ కల్యాణ్ స్పందించారు. నాన్ లోకల్ అంటూ ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులకు పవన్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

Also Read : సినిమాలు చేయడంపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

పిఠాపురం ప్రజలను ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి, సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు ప్రకటించారు. ఉప్పాడ నుంచి కాకినాడ వరకు ఉన్న తీర ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది యువతకు ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు. పిఠాపురాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తానని పవన్ కల్యాణ్ హామీయిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు