YS Jagan comments after meet Pinnelli Ramakrishna Reddy in Nellore Jail
YS Jagan: టీడీపీకి ఓటు వేయనివారిపై రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. గురువారం నెల్లూరు సెంట్రల్ జైలులో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలు పక్కనపెట్టి విధ్వంసకర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆస్తుల విధ్వంసం, దాడులతో ఏపీని రావణం కాష్టం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ప్రజలకు మంచి చేసినా తమ పార్టీ ఓడిపోయిందని, చంద్రబాబు చేసిన మోసపూరిత హామీలతో కూటమి అధికారంలోకి వచ్చిందని వైఎస్ జగన్ అన్నారు. తమ పాలనలో కులం, మతం, ప్రాంతం చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై దొంగ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.
Also Read : అలా చెబితే వాళ్లు నన్ను కొడ్తారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కామెంట్స్
చంద్రబాబు పాపాలు వేగంగా పండుతున్నాయని జగన్ జగన్ అన్నారు. ఎవరు తప్పు చేసినా తప్పు అని నాయకుడిగా మనం చెప్పాలి. దగ్గరుండి దాడులను ప్రోత్సహించడం అతి దుర్మార్గం. దాడులను కచ్చితంగా ఆపాలి. ఈసారి కోరడం లేదు హెచ్చరిస్తున్నామని చెబుతున్నాం. ఇదే మాదిరిగా దాడులు కొనసాగితే ఎవరూ చూస్తూ ఊరుకోరు. రియాక్షన్ అనేది కచ్చితంగా ఉంటుందని చంద్రబాబుకు చెబుతున్నానని వైఎస్ జగన్ అన్నారు.