Walking : మోకాలి నొప్పులతో బాధపడేవారు వాకింగ్ చెయ్యెచ్చా ?

మోకాలి చుట్టూ ఉన్న కండరాలు, కీళ్లను బలోపేతం చేయడానికి సహాయపడే వ్యాయామం నడక. నడుస్తున్నప్పుడు దాని ప్రభావం ఎముకలు, కండరాలు, కీళ్లలోని కార్టిలేజ్పై ఉంటుంది. నడక వల్ల ఈ భాగాలు ఫ్లెక్సిబుల్ గా, బలంగా తయారవుతాయి.

knee pain walk

Walking : వాకింగ్ అనేది మంచి ఎక్సర్ సైజ్ అని చెబుతారు డాక్టర్లు. పెద్ద వయసు వాళ్లు, ఇంటెన్సివ్ ఎక్సర్ సైజ్ చేయలేనివాళ్లు కనీసం నడిస్తే అయినా మంచి వ్యాయామం అవుతుందని సూచిస్తారు. కానీ మోకాళ్ల నొప్పులతో సతమతం అయ్యేవాళ్లునాలుగడుగులు కూడా వేయలేరు. ఇలాంటప్పుడు వాకింగ్ చేయాలా వద్దా.. అనే సందేహం చాలామందిలో కలుగుతుంటుంది.

READ ALSO : Look Younger : యంగ్ గా కనిపించడం కోసం.. అలవాట్లు కూడా కీలకమే !

వయసు మీద పడినవారికి ఈ కీళ్లనొప్పుల సమస్య ఉంటుంది. మరోవైపు వారి ఆరోగ్యం దృష్ట్యా వారు చేయగల వ్యాయామం నడక మాత్రమే. కానీ, నడవాలంటే ఉన్న నొప్పి పెరుగుతుందనే అనుమానంతో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉంటారు.

కీళ్ల నొప్పులెందుకు?

వయసు ప్రభావం కారణంగా కీళ్ళు, ఎముకలు డీజనరేట్ అవుతాయి.శారీరక శ్రమ లేని జీవనశైలిఈ డీజనరేషన్ ప్రక్రియ వేగవంతం అవుతుంది.మోకాలి నొప్పికి ఆర్థరైటిస్, ప్రమాదాల వల్ల కలిగినగాయాలు లేదా ఏ పని చేయకుండా కీళ్ళకుతగినంతగాకదలించలేకపోవడం వంటి కారణాలు కూడా ఉండవచ్చు. దీంతో కీళ్ళలో ఫ్లెక్సిబిలిటీ తగిపోతుంది, వాటిని కదిలించలేనంత గట్టిగా మారి, నొప్పి, వాపు కూడా ఉంటాయి.

READ ALSO : Liver Infections : హెపటైటిస్ నుంచి కాలేయాన్ని కాపాడుకుందాం

నడకే ఉత్తమం

మోకాళ్ల నొప్పులు ఉన్నప్పుడు వాకింగ్ లేదా ఏ విధమైన శారీరక శ్రమను చేయడానికి కూడా కీళ్లు సహకరించవు. అయితే కీళ్లు యాక్టివ్ గా, ఆరోగ్యంగా ఉండాలంటే ఉపయోగపడే అద్భుత వ్యాయామం నడకే. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గించుకోవడానికి నడక లేదా శారీరక శ్రమ చేయడమే మంచిది. నడక మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలు, కీళ్లను బలోపేతం చేస్తుంది. కీళ్లలో లూబ్రికేషన్‌కు కూడా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా నడవడం వల్ల మోకాళ్ల నుండి వచ్చే ఒత్తిడిని తగ్గించి, నొప్పిని తగ్గిస్తుంది. మోకాలి నొప్పులకు పెరిగే శరీర బరువు కూడా ఒక కారణం.నడకతో బరువు కూడా తగ్గవచ్చు.

కండరాలకు పుష్టి, కీళ్లకు బలం

మోకాలి చుట్టూ ఉన్న కండరాలు, కీళ్లను బలోపేతం చేయడానికి సహాయపడే వ్యాయామం నడక. నడుస్తున్నప్పుడు దాని ప్రభావం ఎముకలు, కండరాలు, కీళ్లలోని కార్టిలేజ్పై ఉంటుంది. నడక వల్ల ఈ భాగాలు ఫ్లెక్సిబుల్ గా, బలంగా తయారవుతాయి. మోకాలికీలుకు స్థిరత్వం వస్తుంది. కండరాలు బలంగా మారడం వల్ల మోకాలికీలుపై ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా కీళ్ల పనితీరు మెరుగుపడుతుంది.

READ ALSO : Bone Health : ఎముకల ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన పండ్లు, ఆకుకూరలు ఇవే!..

కీళ్లకు లూబ్రికేషన్

నడిచినప్పుడుమోకాలికీలులో వచ్చే కదలిక సైనోవియల్ ద్రవం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, ఇది కందెన లాగా అంటే లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది. ఈ ద్రవం ఎముకల మధ్య ఘర్షణను తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల కీళ్లలో డిస్కమ్ఫర్ట్ ఉండదు.

ఫ్లెక్సిబిలిటీ

నడవడం ద్వారా మోకాళ్లు పూర్తి స్థాయిలో కదులుతాయి. దీనివల్ల కీళ్ల చుట్టుపక్కల ఉన్న కండరాలు బలంగా తయారవుతాయి. ఫ్లెక్సిబిలిటీ పెరిగి, నొప్పి తగ్గుతుంది.

READ ALSO : Constipation : మలబద్ధకం సమస్య ఎందుకొస్తుంది? అనేక రోగాలకు మలబ్ధకమే కారణమా?

అధిక బరువుకు చెక్

మోకాళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే బరువు అధికంగా పెరగకూడదు. అధిక బరువు వల్ల మోకాళ్లపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. అందువల్ల ఇవి త్వరగా డీజనరేట్ అవుతాయి. చివరికి మోకాళ్ల నొప్పి మొదలవుతుంది. బరువు తగ్గడానికి చక్కని వ్యాయామం వాకింగ్.ఇది కేలరీలను బర్న్ చేస్తుంది.మొత్తం కొవ్వు తగ్గడానికి దోహదపడుతుంది.

మానసిక ఉత్సాహం

నడక శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. రెగ్యులర్ గా నడవడం వల్ల శరీరంలో సహజమైన అనుభూతిని కలిగించే హార్మోన్లు అయిన ఎండార్ఫిన్‌లు విడుదల అవుతాయి, ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. ఆరుబయట, పార్కులో నడవడం వల్ల ప్రకృతితో కనెక్ట్ అవుతాం. దానివల్ల మానసికంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండగలుగుతాం.

 

ట్రెండింగ్ వార్తలు