Artificial Sweeteners : చక్కెరకు బదులుగా కృత్రిమ స్వీటెనర్లు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే విషయాలను గుర్తుంచుకోండి..

కొందరు వ్యక్తులు కొన్ని కృత్రిమ స్వీటెనర్లను తీసుకున్నప్పుడు జీర్ణ అసౌకర్యం లేదా ఇతర దుష్ప్రభావాలు కలుగుతాయి. ఈ సమయంలో శరీరం వివిధ రకాలకు స్పందిస్తుంది. దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించటం మంచిది. తదనుగుణంగా కృత్రిమ స్వీటెనర్ల పరిమాణాన్ని వినియోగించుకోవాలి.

artificial sweetener

Artificial Sweeteners : ఇటీవలి కాలంలో కృత్రిమ స్వీటెనర్లు బాగా జనాదరణ పొందుతున్నాయి. కృత్రిమ స్వీటెనర్లు క్యాన్సర్ కారకంగా ప్రకటించాలని WHO యోచిస్తున్నట్లు నివేదికలు చెప్తున్న నేపధ్యంలో విస్తృతంగా ఉపయోగిస్తున్న చక్కెర ప్రత్యామ్నాయాలపై పెద్ద చర్చసాగుతుంది. ఈ కృత్రిమ స్వీటెనర్‌లను ఫిట్‌నెస్ ఔత్సాహికులు కూడా తరచుగా వినియోగిస్తారు, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో, ఆహారంలో వీటి రోజువారీ వినియోగం పెరుగుతుంది.

READ ALSO : Diabetes and headaches : తలనొప్పి అనేది రక్తంలో చక్కెర ఎక్కువ లేదా తక్కువగా ఉన్నప్పుడు కనిపించే లక్షణమా?

WHO యొక్క క్యాన్సర్ రీసెర్చ్ ఆర్మ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) సంస్ధ కృత్రిమ స్వీటెనర్ గా ఉన్న అస్పర్టమే మనుషులలో క్యాన్సర్ కారకంగా ప్రకటించబోతున్నట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొన్న తర్వాత అస్పర్టమే ముఖ్యంగా వార్తల్లో నిలిచింది. FDA ఇంతకుముందు అస్పర్టమే రోజువారీ తీసుకోవడం అన్నది శరీర బరువుకు 50 mgగా నిర్ణయించింది, అయితే యూరోపియన్ యూనియన్ అస్పర్టమే రోజుకు 40 mg తీసుకోవాలని (ADI) సిఫార్సు చేసింది.

READ ALSO : Kadwa Badam : రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి దోహదపడే కద్వా బాదం !

మధుమేహం ఉన్నవారు మరియు 50 ఏళ్లు పైబడిన వారు వైద్య నిపుణులు సిఫార్సు చేసిన మేరకు కృత్రిమ స్వీటెనర్లను పరిమిత పరిమాణంలో తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో కృత్రిమ స్వీటెనర్లను వినియోగించేటప్పుడు చేయవలసినవి , చేయకూడని వాటి గురించి నిపుణులు ఏంచెబుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

చేయవలసినవి:

1. హైడ్రేటెడ్ గా ఉండండి: కృత్రిమ స్వీటెనర్లను కలిగి ఉన్న ఆహారాలు లేదా పానీయాలు తీసుకునేవారు తగినంత మొత్తంలో నీరు త్రాగాలి. మొత్తం ఆరోగ్యానికి నీరు తీసుకోవటం అన్నది చాలా ముఖ్యం. అంతేకాకుండా సమతుల్య ఆహారాన్ని తీసుకోవటానికి ఇది సహాయపడుతుంది.

READ ALSO : High Blood Sugar: రక్తంలో చక్కెర స్థాయి పెరిగిందన్న విషయాన్ని తెలిపే 15 లక్షణాలు

2. వ్యక్తిగత సహనం : కొందరు వ్యక్తులు కొన్ని కృత్రిమ స్వీటెనర్లను తీసుకున్నప్పుడు జీర్ణ అసౌకర్యం లేదా ఇతర దుష్ప్రభావాలు కలుగుతాయి. ఈ సమయంలో శరీరం వివిధ రకాలకు స్పందిస్తుంది. దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించటం మంచిది. తదనుగుణంగా కృత్రిమ స్వీటెనర్ల పరిమాణాన్ని వినియోగించుకోవాలి.

3. దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని: మీరు చక్కెర తీసుకోవడం తగ్గించడానికి , ఆరోగ్య పరిస్థితిని నిర్వహించడానికి ఒక ప్రణాళికలో భాగంగా కృత్రిమ స్వీటెనర్లను ఉపయోగిస్తుంటే, మీ లక్ష్యాలను ఆరోగ్య సంరక్షణ నిపుణులు , లేదా డైటీషియన్‌తో ముందుగా చర్చించటం మంచిది. నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా మార్గదర్శకాలను వారు సూచిస్తారు.

READ ALSO : Revanth Reddy: మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తాం

చేయకూడనివి:

1. క్యాలరీ రహితమైతే : కృత్రిమ స్వీటెనర్లు తక్కువ కేలరీలు లేదా క్యాలరీ రహితంగా ఉన్నప్పటికీ, మొత్తం కేలరీల తీసుకోవడం అన్నది బరువు నిర్వహణపై ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోవడం చాలా అవసరం. అన్ని వైపుల నుండి తీసుకునే ఆహారంలో మొత్తం కేలరీల వినియోగం గురించి ఎప్పటికప్పుడు దృష్టిసారించటం మంచిది.

2. దంత సంరక్షణ : కృత్రిమ స్వీటెనర్లు చక్కెర మాదిరిగానే దంతక్షయానికి కారణమవుతాయి. రోజువారి బ్రషింగ్ , ఫ్లాసింగ్ వంటి మంచి నోటి పరిశుభ్రత చర్యలను పాటించటం దంత ఆరోగ్యానికి కీలకం.

READ ALSO : High Sugar Consumption : అధిక చక్కెర వినియోగం గుండె జబ్బుల రిస్క్ పెంచుతుందా?

3. సహజ ప్రత్యామ్నాయాలు: కృత్రిమ స్వీటెనర్‌లు ఉపయోగకరమైనప్పటికీ, మాంక్ ఫ్రూట్ ఎక్స్‌ట్రాక్ట్‌లు వంటి సహజ ప్రత్యామ్నాయాలుగా ఎంచుకోండి. ఆహార లక్ష్యాలకు అనుగుణంగా ఉంటే వాటిని తీసుకోవటం మర్చిపోవద్దు. సహజమైన స్వీటెనర్ లు భిన్నమైన రుచితోపాటు అదనపు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు