Russia -Ukraine War: అఫ్ఘానిస్తాన్ నుంచి యుక్రెయిన్‌కు.. రష్యా దాడులతో మరో దేశానికి

ఏడాది క్రితం అఫ్ఘానిస్తాన్ వదిలి వెళ్లిన అజ్మల్ రహ్మానీ యుక్రెయిన్ లో ప్రశాంతంగా బతకొచ్చని అనుకున్నాడు. వారం రోజులుగా అక్కడి వాతావరణం అవన్నీ సాధ్యపడవంటూ మరోసారి ప్రయాణానికి....

Russia Ukraine War: ఏడాది క్రితం అఫ్ఘానిస్తాన్ వదిలి వెళ్లిన అజ్మల్ రహ్మానీ యుక్రెయిన్ లో ప్రశాంతంగా బతకొచ్చని అనుకున్నాడు. వారం రోజులుగా అక్కడి వాతావరణం అవన్నీ సాధ్యపడవంటూ మరోసారి ప్రయాణానికి సిద్ధం చేశాయి. రష్యా బాంబు శబ్దాలకు ఉలిక్కిపడి పోలాండ్ వలస వెళ్లేందుకు సిద్ధమైంది ఆ కుటుంబం.

‘ఒక యుద్ధం నుంచి పరిగెత్తి ఈ దేశానికి వస్తే ఇక్కడ మరో యుద్ధం జరుగుతుంది. చాలా దురదృష్టం’ అని రహ్మనీ పోలాండ్ లో అడుగుపెడుతూ అన్నాడు.

చేతిలో బొమ్మను ఎత్తుకుని ఉన్న ఏడేళ్ల కూతురు మార్వాను చేయి పట్టుకుని మరో దేశానికి చేరుకున్నాడు. మార్వా, భార్య మీనా, కొడుకు ఒమర్ లతో కలిసి 30కిలోమీటర్లు నడిచి యుక్రెయిన్ దేశ సరిహద్దు దాటారు.

Read Also : అమెరికా వల్లనే యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర.. అగ్రరాజ్యంపై ఉత్తరకొరియా ఆగ్రహం!

Medykaకు చేరుకుని తమ లాంటి ఇతర వ్యక్తుల కోసం ఎదురుచూస్తూ నిలబడ్డారు. వేల మంది ఈ నాలుగు రోజుల్లో పోలాండ్, హంగేరీ, రొమానియాలకు వలస పోయారు.

40ఏళ్ల వయస్సున్న రహ్మానీ కాబూల్ ఎయిర్‌పోర్టులో NATOకోసం 18ఏళ్లుగా పనిచేశాడు. అమెరికా తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటుందనే నిర్ణయంతో అఫ్ఘానిస్తాన్ వదిలిపోవాలని తాలిబాన్లు ఆక్రమించడానికి 4నెలల ముందే నిర్ణయించుకున్నాడు. స్కూల్ నుంచి తమ పిల్లలను పంపించేయడంతో సమస్య మొదలైంది.

‘అంతకంటే ముందు నా జీవితం చాలా బాగుండేది. సొంతిళ్లు, సొంత కారు, మంచి జీతం ఉండేవి. ఇల్లు, కారుతో సహా ఉన్నదంతా అమ్మేసుకున్నా. అన్నీ కోల్పోయా. నా కుటుంబం కంటే ఇవేమీ ఎక్కువ కాదని తెలుసు’ అని రహ్మానీ చెబుతున్నాడు.

Read Also: యుక్రెయిన్ నుంచి తిరిగివస్తున్న తెలుగు విద్యార్థులు .. ఢిల్లీకి చేరిన ఐదో విమానం..!

అఫ్ఘానిస్తాన్ నుంచి బయటకు వెళ్లడానికి వీసా కోసం ప్రయత్నించి ఫెయిలయ్యాడు. ఆ సమయంలో యుక్రెయిన్ కు వెళ్లేందుకు మాత్రమే అవకాశం ఉండటంతో బయల్దేరి బ్లాక్ సీ పోర్ట్ సిటీ అయిన ఒడెస్సాలో మకాం పెట్టారు.

నాలుగు రోజుల క్రితం రష్యా బలగాలు యుక్రెయిన్ పై తెగబడటంతో మరోసారి అన్నీ వదిలేసి 11వందల 10 కిలోమీటర్లు ప్రయాణించి సరిహద్దుకు చేరుకున్నారు.

పోలాండ్ లోకి గురువారం నుంచి 2లక్షల 13వేల మంది చొరబడినట్లు పోలాండ్ అధికారులు చెబుతున్నారు.
రహ్మానీ కుటుంబానికి పాలిష్ వీసా కావాలంటే 15రోజుల సమయం పడుతుందని ఒక లాయర్ చెబుతున్నారు. ఈ విషయంపై పోలాండ్ వీలైనంత త్వరగా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు