Taliban Government : అఫ్ఘానిస్థాన్ తాలిబన్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం.. మహిళలు యూనివర్సిటీల్లో చదవడం నిషేధం

తాలిబన్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. దేశంలోని మహిళలు యూనివర్సిటీల్లో చదవడంపై నిషేధం విధించింది. మహిళలకు విద్యాబోధన వెంటనే నిలిపివేయాలని ఉన్నత విద్యాశాఖ మంత్రి నేదా మహమ్మద్ నదీమ్.. ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలకు లేఖ రాశారు.

Taliban Government : అఫ్ఘానిస్థాన్ లో తాలిబన్ ప్రభుత్వం మహిళలపై ఆంక్షల మీద ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే మహిళలపై పలు కఠినమైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. పురుషులు వెంట లేకుండా మహిళలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లకూడదని, బాలికల సెకండరీ స్కూళ్లు మూసివేయాలని, మహిళలు ఉద్యోగాలు చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా తాలిబన్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.

దేశంలోని మహిళలు యూనివర్సిటీల్లో చదవడంపై నిషేధం విధించింది. మహిళలకు విద్యాబోధన వెంటనే నిలిపివేయాలని ఉన్నత విద్యాశాఖ మంత్రి నేదా మహమ్మద్ నదీమ్.. ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలకు లేఖ రాశారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించారు.

Taliban Govt : మీడియాకు తాలిబన్ల హుకూం..మహిళలు కనిపించే షోలు ప్రసారం చేయద్దు..జర్నలిస్టులు బురఖా ధరించాల్సిందే

మరోవైపు తాలిబన్ ప్రభుత్వ నిర్ణయాన్ని అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు వ్యతిరేకిస్తున్నాయి.
మహిళలకు యూనివర్సిటీ విద్యపై నిషేధం విధింపు, బాలికల సెకండరీ స్కూల్ మూసివేయడం, మహిళలు, బాలికలపై ఆంక్షలు విధించడం వంటివి వారి హక్కులు, స్వేచ్ఛను హరించడమే అవుతుందని అమెరికా హోంశాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు.

మహిళలకు యూనివర్సిటీ విద్యను దూరం చేసే తాలిబన్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితిలో బ్రిటన్ రాయబారి బార్బరా వుడ్ వార్డ్ తీవ్రంగా ఖండించారు. ఇది మహిళల హక్కులను కాలరాయడమేనని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు