IPL 2024 : సచిన్ టెండూల్కర్ 14ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన సాయి సుదర్శన్.. తొలి భారతీయుడు అతనే..!

గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటర్ సాయి సుదర్శన్ కేవలం 25 ఇన్నింగ్స్ లలోనే వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. దీంతో ఐపీఎల్ లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన ..

Sai sudharsan

GT vs CSK : ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టు 35 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 231 పరుగులు చేసింది. 232 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై పోరాడి ఓడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులకే సీఎస్‌కే పరాజయం పాలైంది. దీంతో అయిదో విజయంతో గుజరాత్ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. 12 మ్యాచ్ లలో ఆరో ఓటమితో ప్లేఆప్స్ అకాశాలను సీఎస్కే కాస్త సంక్లిష్టం చేసుకుంది.

Also Read : IPL 2024 : ఐపీఎల్ చరిత్రలో శుభమాన్ గిల్, సాయి సుదర్శన్ సరికొత్త రికార్డు

ఈ మ్యాచ్ లో గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ 51 బంతుల్లో 103 పరుగులు చేయగా.. శుభమాన్ గిల్ 55బంతుల్లో 104 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో సాయి సుదర్శన్ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తిచేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన భారతీయ బ్యాట్స్ మెన్ సచిన్ టెండూల్కర్. అతను 31 ఇన్నింగ్స్ లలో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు.

Also Read : IPL 2024 : చెన్నైకి తప్పని ఓటమి.. 35 పరుగుల తేడాతో గుజరాత్ ఘన విజయం

గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటర్ సాయి సుదర్శన్ కేవలం 25 ఇన్నింగ్స్ లలోనే వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. దీంతో ఐపీఎల్ లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన భారతీయ బ్యాటర్ గా సుదర్శన్ నిలిచాడు. దీనికి ముందు ఐపీఎల్ లో రుతురాజ్ గైక్వాడ్ వెయ్యి పరుగులు చేయడానికి 31 ఇన్నింగ్స్ లు తీసుకున్నాడు. ఇప్పటికు ఐపీఎల్ చరిత్రలో అన్ని దేశాల బ్యాటర్లలో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన వారిలో ఆస్ట్రేలియా ప్లేయర్ షాన్ మార్ష్ అగ్రస్థానంలో నిలిచాడు. మార్ష్ కేవలం 21 ఇన్నింగ్స్ లలోనే వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. లెండిల్ సిమన్స్ 23 ఇన్నింగ్స్ లలో వెయ్యి పరుగులు చేసి రెండో స్థానంలో నిలిచాడు. మూడో స్థానంలో మాథ్యూ హెడెన్ తో కలిసి సాయి సుదర్శన్ సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. హేడెన్ 25 ఇన్నింగ్స్ లలో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు.

IPLలో తక్కువ ఇన్నింగ్స్ లలో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారతీయుల జాబితా..
సాయి సుదర్శన్ – 25 (ఇన్నింగ్స్ లో)
సచిన్ టెండూల్కర్ – 31 (ఇన్నింగ్స్ లలో)
రుతురాజ్ గైక్వాడ్ – 31 (ఇన్నింగ్స్ లలో)
తిలక్ వర్మ – 33 (ఇన్నింగ్స్ లలో)
సురేష్ రైనా – 34 (ఇన్నింగ్స్ లలో)
యశస్వి జైస్వాల్ – 34 (ఇన్నింగ్స్ లలో)

 

 

ట్రెండింగ్ వార్తలు