Amit Shah and Priyanka Gandhi
Telangana Election 2024 : పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇవాళ ఆఖరి రోజు. సాయంత్రం 6గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దీంతో తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీలు తెలంగాణలో పర్యటించనున్నారు. సాయంత్రం వరకు బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గోనున్నారు.
Also Read : Cm Revanth Reddy : తెలంగాణ సమాజానికి ఆ పార్టీ అత్యంత ప్రమాదకరం, ఒక్క సీటు కూడా గెలవకూడదు- సీఎం రేవంత్
కేంద్ర మంత్రి అమిత్ షా వికారాబాద్, వనపర్తి బహిరంగ సభల్లో పాల్గొని బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తారు. సాయంత్రం 3గంటలకు విలేకరుల సమావేశంలో మాట్లాడతారు. వికారాబాద్ పట్టణంలోని ఎస్ఏపీ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ఉదయం 11గంటలకు అమిత్ షా పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12గంటలకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు.
Also Read : Kcr : ఈసారి అందరూ ఆలోచించి ఓటు వేయాలి- సిరిసిల్లలో కేసీఆర్
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ తాండూరు, కామారెడ్డి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ప్రియాంక వెంట సీఎం రేవంత్ రెడ్డికూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10గంటలకు పఠాన్ చెరు కార్నర్ మీటింగ్ లో పాల్గోనున్న సీఎం రేవంత్ రెడ్డి.. మధ్యాహ్నం 1గంటకు తాండూర్ జన జాతర సభకు ప్రియాంక గాంధీతో కలిసి హాజరవుతారు. సాయంత్రం 3.15 గంటలకు ప్రియాంక గాంధీతో కలిసి కామారెడ్డిలో రోడ్ షోలో రేవంత్ రెడ్డి పాల్గోనున్నారు.