Kavitha : కేసీఆర్ ఫొటో లేకుండానే ప్రజల్లోకి వెళ్తున్నా.. ‘జాగృతి జనం బాట‘ పోస్టర్‌ను ఆవిష్కరించిన కవిత

Kavitha : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కీలక కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఫొటో లేకుండానే ప్రజల్లోకి వెళ్తున్నానని చెప్పారు.

Kavitha : కేసీఆర్ ఫొటో లేకుండానే ప్రజల్లోకి వెళ్తున్నా.. ‘జాగృతి జనం బాట‘ పోస్టర్‌ను ఆవిష్కరించిన కవిత

kavitha

Updated On : October 15, 2025 / 2:36 PM IST

Kavitha : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కీలక కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఫొటో లేకుండానే ప్రజల్లోకి వెళ్తున్నానని చెప్పారు. జాగృతి జనం బాట పేరుతో కవిత తెలంగాణలోని జిల్లాల్లో యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ యాత్రకు సంబంధించిన వివరాలను తెలిపారు. సామాజిక చైతన్యం కోసమే జాగృతి జనం బాట యాత్ర అని చెప్పారు.

నేను ప్రజల దగ్గరకు వెళ్లి వారు ఏం అనుకుంటున్నారో తెలుసుకుంటాను . కేసీఆర్‌కు బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి రెండు కళ్లలా పనిచేశాయి. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో నేను కేసీఆర్ ఫొటో పెట్టుకుని వెళ్తే నన్ను బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీంతో నైతికతగా భావించి నేను కేసీఆర్ ఫొటో లేకుండా ప్రజల్లోకి వెళ్తున్నాను అంటూ కవిత పేర్కొన్నారు.

Also Read: MP Arvind : సీఎం రేవంత్ రెడ్డికి డెడ్‌లైన్ పెట్టిన బీజేపీ ఎంపీ అరవింద్.. కేటీఆర్ వ్యాఖ్యలపై ఫైర్

రాజకీయ పార్టీకి అవకాశం ఉందా..? లేదా?.. పార్టీ పెట్టవచ్చా లేదా అనేదిప్రజలను అడిగి తెలుసుకుంటాం. నా రాజీనామాను ఆమోదించాలని నేను పదేపదే కోరుతున్నాను. పార్టీ నన్ను వద్దు అనుకున్నప్పుడు ఎమ్మెల్సీ పదవి ఎందుకు అని కవిత అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఏంటో అర్ధం కావడం లేదు. నా రాజీనామా ఆమోదిస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సి వస్తుందని భయపడుతున్నారేమోనని కవిత పేర్కొన్నారు.

జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు వైఫల్యం చెందాయి. నేను తెలంగాణ మొత్తం తిరగాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది చాలా చిన్న విషయం. జూబ్లీహిల్స్ కు ఉప ఎన్నికకు తెలంగాణ జాగృతికి సంబంధం లేదని కవిత అన్నారు.

నాలుగు నెలల పాటు యాత్ర ఉంటుందని, ప్రతి జిల్లాల్లో రెండు రోజులు ఉంటామన్నారు. జిల్లాల్లో ఉన్న అన్ని వర్గాల ప్రజలతో కలిసి మాట్లాడతామని కవిత తెలిపారు. సామాజిక తెలంగాణ కోసం ఏం చేయాలనే విషయాలను ప్రజల నుండే తెలుసుకుంటామన్నారు. సామాజిక తెలంగాణ అంటే నినాదం కాదు విధానమని వివరించారు. తాము ఉన్నన్ని రోజులు సామాజిక తెలంగాణ కోసం పనిచేస్తామని కవిత స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే గురువులన్నారు. పెద్ద పెద్ద నాయకులను కూడా ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోపెట్టారని కవిత గుర్తు చేశారు. ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటామని అన్నారు.

ఇదిలాఉంటే.. కవిత విడుదల చేసిన జాగృతి జన బాట పోస్టర్ పై తెలంగాణ తల్లి, జయశంకర్ ఫొటోలు ఉన్నాయి.