MP Arvind : సీఎం రేవంత్ రెడ్డికి డెడ్‌లైన్ పెట్టిన బీజేపీ ఎంపీ అరవింద్.. కేటీఆర్ వ్యాఖ్యలపై ఫైర్

MP Arvind నిజామాబాద్ జిల్లాలో ఆర్వోబీల నిధులను వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఎంపీ అరవింద్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

MP Arvind : సీఎం రేవంత్ రెడ్డికి డెడ్‌లైన్ పెట్టిన బీజేపీ ఎంపీ అరవింద్.. కేటీఆర్ వ్యాఖ్యలపై ఫైర్

MP Arvind

Updated On : October 15, 2025 / 1:41 PM IST

MP Arvind : నిజామాబాద్ జిల్లాలో ఆర్వోబీల నిధులను వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఎంపీ అరవింద్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్వోబీల నిధులు విడుదల చేయకుంటే పదిరోజుల్లో నిరాహార దీక్ష చేపడతామని.. దీపావళి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమయం ఇస్తున్నా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ అరవింద్ డెడ్‌లైన్ విధించారు.

మాధవనగర్ ఆర్వోబీ పనులకు నిధులు విడుదల చేయకపోతే నిరాహార దీక్షచేస్తా. ఆర్వోబీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆర్వోబీలకు నిధులు కేంద్రం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ల అవసరాలకు వాడుకుందని అరవింద్ ఆరోపించారు.

Gold thefts : మీ దగ్గర బంగారం, వెండి ఉందా..? అయితే, తస్మాత్ జాగ్రత్త.. హైదరాబాద్ నగర ప్రజలకు పోలీసుల హెచ్చరికలు

రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్‌కు 20కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని అధికారులు బిల్లులు చెయడం లేదు. జిల్లా కలెక్టర్ తన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని కోరుతున్నా.. జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గద్దని అరవింద్ సూచించారు. జాతీయ పసుపు బోర్డు కోసం స్థలం అడిగితే ఇవ్వడం లేదని అరవింద్ విమర్శించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎంపీ అరవింద్ తీవ్ర‌స్థాయిలో విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్‌లో ఓట్ల చోరీ జరిగిందని కేటీఆర్ అనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. రాష్ట్రంలో దొంగ ఓట్లు తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ.. జూబ్లీహిల్స్‌ అపార్టుమెంట్లో 43ఓట్లు దొంగ ఓట్లు అయితే, బోధన్‌లో బీఆర్ఎస్ హయాంలో 42దొంగ పాసుపోర్టులు ఇచ్చిన సంగతి మరిచారా అంటూ ఎంపీ అరవింద్ విమర్శించారు.

జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్, మత్తు పదార్థాల దందాకు తెరలేపింది కేటీఆర్ కాదా అంటూ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ క్లబ్బుల్లో డ్రగ్స్ సరఫరా చేసింది కేటీఆర్ అని ఎంపీ అరవింద్ విమర్శించారు.

42శాతం బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని, బీసీ రిజర్వేషన్ల వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా చేయలేదని, ఈ అంశంలో బీజేపీని కార్నర్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని ఎంపీ అరవింద్ విమర్శించారు.