Konda Surekha: మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హైడ్రామా.. మాజీ ఓఎస్డీ అరెస్ట్ కు పోలీసుల ప్రయత్నం
నిన్ననే కొండా సురేఖ ఓఎస్డీని విధుల నుంచి తప్పించింది ప్రభుత్వం.

Konda Surekha
Konda Surekha: మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసం వద్దకు పోలీసులు మఫ్టీలో వచ్చారు. కొండా సురేఖ మాజీ ఓఎస్డీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులతో కొండా సురేఖ కూతురు సుష్మిత వాగ్వాదానికి దిగారు. నిన్ననే కొండా సురేఖ ఓఎస్డీని విధుల నుంచి తప్పించింది ప్రభుత్వం.
గత నాలుగైదు రోజులుగా వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ, వరంగల్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది. మేడారం టెండర్ల విషయంలో వీరి మధ్య గ్యాప్ ఏర్పడింది. ఈ వివాదం నేపథ్యంలో కొండా సురేఖ ఓఎస్డీని విధుల నుంచి తప్పించింది ప్రభుత్వం. ఓఎస్డీ సుమంత్ కొండా సురేఖ నివాసంలో ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సుమంత్ ని అరెస్ట్ చేయడానికి వెళ్లినట్లు సమాచారం. అసలు సుమంత్ ని విధుల నుంచి ఎందుకు తప్పించారు? అతడిని ఎందుకు అరెస్ట్ చేయాలనుకున్నారు? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
కొండా సురేఖ శాఖలో అవినీతి ఏమైనా జరిగింది? అవినీతి కార్యకలాపాల్లో ఓఎస్డీ సుమంత్ పాత్ర ఏమైనా ఉందా? అనేది చర్చనీయాంశంగా మారింది. అందుకోసమే సుమంత్ ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించాలని అనుకున్నారా? అన్నది ఆసక్తికరంగా మారింది. సుమంత్ ను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు కొండా సురేఖ ఇంటికి మఫ్టీలో వెళ్లడం, కొండా సురేఖ కూతురు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. కొండా సురేఖ కూతురు సుస్మితకు సుమంత్ క్లాస్, సన్నిహితుడు అని చెబుతారు.
సుస్మిత ద్వారానే సుమంత్.. మంత్రి కొండా సురేఖకు ఓఎస్డీగా ఉంటున్నారని ప్రచారం ఉంది. సుమంత్ ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను సుస్మిత అడ్డుకున్నారని, పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారని తెలుస్తోంది. అసలు సుమంత్ ను ప్రభుత్వం ఓఎస్డీగా ఎందుకు తొలగించింది? ఇప్పుడు ఏకంగా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అనేది హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా ఏదో జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే ఏం జరిగింది? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read: వేటు తప్పదా? మంత్రుల తీరుపై సీఎం రేవంత్ సీరియస్.. గాడిన పెట్టేందుకు ఏం చేయబోతున్నారు?