IPL 2024 : ఐపీఎల్ చరిత్రలో శుభమాన్ గిల్, సాయి సుదర్శన్ సరికొత్త రికార్డు

ఐపీఎల్ మ్యాచ్ లో ఒక ఇన్నింగ్స్ లో సెంచరీలు చేసిన మొదటి జంట సాయి సుదర్శన్, శుభమాన్ గిల్ మాత్రమే కాదు. వీరికంటే ముందు..

Shubman Gill and Sai Sudharsan

GT vs CSK : ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఆసక్తికర పోరులో గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 231 పరుగులు చేసింది. 232 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై పోరాడి ఓడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులకే సీఎస్‌కే పరాజయం పాలైంది. దీంతో అయిదో విజయంతో గుజరాత్ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. 12 మ్యాచ్ లలో ఆరో ఓటమితో ప్లేఆప్స్ అకాశాలను సీఎస్కే కాస్త సంక్లిష్టం చేసుకుంది.

Also Read : IPL 2024 : చెన్నైకి తప్పని ఓటమి.. 35 పరుగుల తేడాతో గుజరాత్ ఘన విజయం

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు ఓపెన్లు శుభమాన్ గిల్, సాయి సుదర్శన్ లు ఇద్దరూ సెంచరీలు చేశారు. గిల్ 55 బంతుల్లో 9 ఫోర్లు, ఆరు సిక్సులతో 104 పరుగులు చేయగా.. మరోవైపు సుదర్శన్ 51 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ఇందులో ఐదు ఫోర్లు, ఏడు సిక్సులు ఉన్నాయి. ఐపీఎల్ మ్యాచ్ లో ఒక ఇన్నింగ్స్ లో సెంచరీలు చేసిన మూడో జోడీగా గిల్ – సుదర్శన్ నిలిచారు.

Also Read : Russell – Avika Gor : వెస్టిండీస్ ఆల్‌రౌండ‌ర్‌తో ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన అవికాగోర్‌..

ఐపీఎల్ మ్యాచ్ లో ఒక ఇన్నింగ్స్ లో సెంచరీలు చేసిన మొదటి జంట సాయి సుదర్శన్, శుభమాన్ గిల్ మాత్రమే కాదు. వీరికంటే ముందు.. 2019లో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ లో ఓపెనింగ్ జోడీ డేవిడ్ వార్నర్- జానీ బెయిర్ స్టోలు హైదరాబాద్ కు ఆడుతున్నప్పుడు సెంచరీ ఇన్నింగ్స్ లు ఆడారు. ఆ మ్యాచ్ లో బెయిర్ స్టో 56 బంతుల్లో 114 పరుగులు చేయగా.. మరోవైపు వార్నర్ 55 బంతుల్లో 100 పరుగులు చేశాడు.

2016లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ లయన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అందులో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. ఆర్సీబీ ఓపెనర్ క్రిస్ గేల్ ఆ మ్యాచ్ లో కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఆ తరువాత విరాట్ కోహ్లీ – ఏబీ డివిలియర్స్ లు సెంచరీలు చేశారు. కోహ్లీ 55 బంతుల్లో 109 పరుగులు చేయగా.. డివిలియర్స్ 52 బంతుల్లో 129 పరుగులు చేశాడు.

 

 

ట్రెండింగ్ వార్తలు