Indonesia crocodile : మొనగాడొచ్చాడు..13 అడుగుల మొసలి మెడలో టైర్ తీసాడు..రూ.కోట్ల బహుమతిని ఏంచేశాడంటే..

మొనగాడు వచ్చాడు..13 అడుగుల మొసలి మెడలో టైర్ తీసాడు..ఆరేళ్లుగా మెడలో టైరుతో ఇబ్బంది పడుతున్న మొసలికి సాహసం చేసి విముక్తి కల్పించాడు. దానికి సంబంధించి వచ్చిన ప్రైజ్ మనీని ఏం చేశాడంట

After 6 years..Indonesia crocodile free from tire ‘necklace’:  ఇన్నేళ్లకు మొసలిని కాపాడే మొనగాడు వచ్చాడు..13 అడుగుల మొసలి మెడలో ఆరేళ్లుగా ఉన్న టైర్ తీసాడు..ప్రకటించిన ప్రైజ్ మనీని కూడా తాను తీసుకోకుండా విరాళంగా ఇచ్చేశాడు.జంతువుల్ని,మనుషుల్ని చంపి పీక్కుతినే జీవికి సాహసం చేసి మరీ సహాయం చేసాడు టిల్లు భాయ్..

ఇండోనేషియా ఐల్యాండ్​ సులావేసిలో పాలూ దగ్గర 2016లో ఒక మొసలి కనిపించింది. ఈ ఉప్పు నీటి మొసలి పశువులు, మనుషుల మీద దాడి చేస్తుండేది. అయితే ఎలా వచ్చి పడిందో గాన..ఆ భారీ మొసలి మెడకు ఓ టైర్​ బిగుసుకుపోయింది. లేదా ఆ మొసలే ఆ టైర్ లో తలదూర్చిందేమో తెలీదు. ఆ టైరు దాని మెడకు ఇరుక్కుపోయింది. దాన్ని టైరునుంచి విముక్తి చేద్దామని అధికారులు ఎంతగా యత్నించినా సాధ్యంకాలేదు. దీంతో ఆ మొసలి మెడలోంచి టైర్ తీస్తే ప్రైజ్ మనీ ఇస్తామని అధికారులు ప్రకటిచారు. కానీ దాడి చేస్తుందనే భయంతో దాని దగ్గరగా వెళ్లేందుకు అంతా భయపడ్డారు. కొంతమంది మాత్రం సాహసం చేసిన యత్నించారు.కానీ సాధ్యంకాలేదు.బహుశా దానిని చంపేందుకో లేదంటే పెంచుకునేందుకో ఆ టైర్​ను మెడకు ఉచ్చులా వేసి ఉంటారని భావించారు. ఈలోపు రెండేళ్లు గడిచాయి.

Also read : ధైర్యం ఉందా : 13 అడుగుల మొసలి మెడలో టైర్ తీస్తే రూ.కోట్ల బహుమతి..!

2018లో ఈ మొసలి వీడియో ప్రపంచం దృష్టితో పాటు జంతు సంరక్షకుల దృష్టిని ఆకర్షించింది. టైరు క్రమక్రమంగా దాని మెడకు బిగుసుకుపోతుండడంతో.. దానిని సంరక్షించే ప్రయత్నాలు మొదలయ్యాయి. 2020లో ఆస్ట్రేలియా నుంచి మ్యాట్​ రైట్​ అనే పాపులర్​ సంరక్షకుడు సైతం దానిని రక్షించే ప్రయత్నం చేసారు. కానీ సాధ్యంకాలేదు. ఈ క్రమంలో దానికి టైర్​ తొలగించినవాళ్లకు మనీ ప్రైజ్​ ఆఫర్​ చేశారు.దీంతో చాలామంది యత్నించినా ఫలితంలేకుండాపోయింది. దీంతో ఆ మొసలు అలాగే టైరుతోనే జీవిస్తోంది.

ఈ క్రమంలో 33 ఏళ్ల యువకుడు రంగంలోకి దిగాడు. స్వతహాగానే మూగజీవాలను సహాయం చేయటంలో ఉందుండే ‘టిల్లి’అనే యువకుడు మొసలి మెడలో టైరు తీయటానికి వచ్చాడు. మూగ జీవాలను ఎన్నింటినో రక్షించిన టిల్లి ఈ మొసలికి కూడా టైరునుంచి విముక్తి కల్పించాడు. ఆపదలో మూగజీవాలను రక్షించటానికి ఓపికతో పాటు చాకచక్యం కూడా చాలా అవసరం. అది టిల్లికి చాలా ఉంది. ఎన్నో మూగ జీవాలను రక్షించటంతో టిల్లి చూపిన చాకచక్యం. ఓపికా ఈ మొసలిని రక్షించటంలో కూడా చూపించాడు.దీంట్లో భాగంగానే టిల్లి వచ్చిన వెంటనే పనిలోకి దిగకుండా ఆ మొసలిని బాగా పరిశీలించాడు. అది ఏఏ సమయాల్లో ఏం చేస్తుంది?ఎటువంటి సమయాల్లో వేటాడుతుంది? ఎటువంటి సమయాల్లో తాపీగా ఉంటుంది?అనే విషయాలను పరిశీలించాడు. అలా..మూడు రోజులు ఎదురుచూసి.. దానికి ఓ కోడిని ఎరగా వేసి మొత్తానికి ఆ మొసలిని పట్టుకున్నాడు.

Also read : Juvenile Crocodile : చేపల కోసం వల వేస్తే.. మొసలి పడింది..!

దాన్ని అంత్యంత లాఘవంగా ఒడ్డుకు చేర్చి..స్దానికుల సాయంతో దాని మెడకు పట్టిన టైరును తొలగించి.. పదమూడు అడుగులకు పైన ఉన్న ఆ రాకాసి మొసలిని తిరిగి నీళ్లలోకి వదిలేశాడు. దీంతో అధికారులతో పాటు స్థానికులు కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇన్నేళ్లకు దానికి విముక్తి కల్పించిన టిల్లుని అభినందించారు. ధన్యవాదాలు తెలిపారు. అంతే కాదు ఈ మొసలి మెడలో టైరు తీస్తే బహుమానం ప్రకలించిన అధికారలు దాన్ని టిల్లుకి ఇవ్వబోయారు. కానీ టిల్లు మాత్రం ‘నేను ప్రైజ్ మనీ కోసం ఇది చేయలేదని..ఆ డబ్బును శాంక్చురీ కోసం విరాళంగా ఇచ్చేశాడు. అలా ఆ సాహసి అరేళ్లుగా టైరుతో ఇబ్బంది పడుతున్న మొసలికి విముక్తి కల్పించటమే కాకుండా తన పెద్ద మనసును చాటుకున్నాడు.

కాగా ఈ మొసలిని స్థానికులు ముద్దుగా ‘మువాయ కలంగ్​ బన్’..​ అని పిలుచుకునేవారు. అంటే..మెడలో టైరు హారంగా ఉన్న మొసలి అని మీనింగ్​ (crocodile with a tyre necklace)..అని అర్థం. అలా ఆ మువాయ కలంగ్ బన్ కు విముక్తి కల్పించాడు మన టిల్లు భాయ్..

 

ట్రెండింగ్ వార్తలు