Germany Sword: జర్మనీలో మూడువేల ఏళ్లనాటి కత్తి లభ్యం.. దీని ప్రత్యేకత ఏమిటంటే ..

జర్మనీలో పురావస్తు శాస్త్రవేత్తలు మూడువేల ఏళ్లనాటి కత్తిని కనుగొన్నారు. శ్మశాన వాటికలో సమాధుల మధ్య దీనిని గుర్తించారు.

Germany Sword

Germany Sword: జర్మనీలో పురావస్తు శాస్త్రవేత్తలు మూడువేల ఏళ్లనాటి కత్తిని కనుగొన్నారు. అయితే, ఆ కత్తి ఇప్పటికీ కాంతివంతంగా మెరిసిపోతుండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. కంచు యుగపు నాటికాలంలో దీనిని భద్రపరిచినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. బవేరియన్ స్టేట్ ఆఫీసర్ ఫర్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ జూన్ 14న విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. బవేరియన్ పట్టణంలోని నోర్డింలింగెన్‌లో శ్మశాన వాటిక నుండి మూడువేళ ఏళ్లనాటి కత్తిని కనుగొన్నారు. ఒక పురుషుడు, స్త్రీ, పిల్లల సమాధుల మధ్యలో దీనిని గుర్తించారు.

Cyclone Biparjoy Expected To Weaken: బిపర్‌జోయ్ తుపాన్ వచ్చే 12 గంటల్లో బలహీనం

కత్తి ఇప్పటికీ చాలా ప్రకాశంవంతంగా ఉంది. ఇది కాంస్య ఫుల్-హిల్డ్ కత్తుల (అష్టభుజి కత్తి రకం) రకమని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని అష్టభుజి పట్టీ పూర్తిగా కాంస్యంతో తయారు చేయబడి ఉంది. ఈ ఖడ్గాన్ని 14వ దశాబ్దం బీసీ చివరినాటికి చెందినదిగా భావిస్తున్నారు. ఆ సమయంలో ఖడ్గ ఆవిష్కరణలు చాలా అరుదు. ఎందుకంటే అనేక మధ్య కాంస్య యుగం సమాధులు సహస్రాబ్దాలుగా దోచుకోబడ్డాయి. నైపుణ్యం కలిగిన స్మిత్‌లు మాత్రమే ఈ అష్టభుజి కత్తులను తయారు చేయగలరని పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు.

Bipar-joy cyclone babies Born: గుజరాత్లో 707 మంది బిపర్ జోయ్ తుపాన్ శిశువులు జన్మించారు

ఇప్పటికి కత్తి చురుకైన ఆయుధంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే, బ్లేడ్ యొక్క ముందుభాగంలో చాలా పదునుగా ఉంది. ఉత్తర కెంట్ నదీగర్భంలో 3వేల సంవత్సరాల నాటి పసిపిల్లల షూ కనుగొనబడిన కొద్ది నెలల తరువాత పురావస్తు శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. ఇదిలాఉంటే చరిత్ర ఆధారంగా.. కాంస్య యుగం 3300బీసీ నుండి 1200బీసీ వరకు జరిగింది. మానవులు లోహంతో పనిచేయడం, కొత్త ఉపకరణాలు, ఆయుధాలను తయారు చేయడం ఇదే మొదటిసారి.

ట్రెండింగ్ వార్తలు