First For US Military : జో బిడెన్ సంచలన నిర్ణయం…మొట్టమొదటిసారి యూఎస్ నేవీకి మహిళా అధికారిణి నేతృత్వం

యూఎస్ నేవీ చీఫ్ ఎంపిక విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొట్టమొదటిసారి యూఎస్ నేవీ చీఫ్ గా అడ్మిరల్ లిసా ఫ్రాంచెట్టిని నామినేట్ చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారు....

Admiral Lisa Franchetti

First For US Military : యూఎస్ నేవీ చీఫ్ ఎంపిక విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొట్టమొదటిసారి యూఎస్ నేవీ చీఫ్ గా అడ్మిరల్ లిసా ఫ్రాంచెట్టిని నామినేట్ చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారు. (Biden Picks Female Admiral) లిసా ఫ్రాంచెట్టి గతంలో ఒక గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్, డిస్ట్రాయర్ స్క్వాడ్రన్, రెండు క్యారియర్ స్ట్రైక్ గ్రూపులకు కమాండ్ అధికారిణిగా పనిచేశారు.

North Korea : ఉత్తర కొరియా మళ్లీ పలు క్రూయిజ్ క్షిపణుల ప్రయోగం…తీవ్ర ఉద్రిక్తత

ఫ్రాంచెట్టి (Admiral Lisa Franchetti) వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్ పాత్రతో సహా కమీషన్డ్ అధికారిణిగా అమెరికా దేశానికి 38 సంవత్సరాలపాటు అంకితభావంతో పనిచేసిందని బిడెన్ ఒక ప్రకటనలో తెలిపారు. యునైటెడ్ స్టేట్స్ నేవీలో ఫోర్-స్టార్ అడ్మిరల్ ర్యాంక్ సాధించిన రెండవ మహిళ ఈమె.

Rajasthan minister : మహిళల భద్రతపై సొంత ప్రభుత్వంపైనే విమర్శలు…రాజస్థాన్ మంత్రిపై సీఎం వేటు

లిసా మళ్లీ నావల్ ఆపరేషన్స్ చీఫ్‌గా (Lead US Navy), జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌లో పనిచేసిన మొదటి మహిళగా చరిత్ర సృష్టిస్తుందని జోబిడెన్ పేర్కొన్నారు. అడ్మిరల్ మైక్ గిల్డే నావికాదళ అధిపతిగా నాలుగు సంవత్సరాల పదవీకాలాన్ని వచ్చే నెలలో పూర్తి చేసుకోనున్నారు. అనంతరం ఫ్రాంచెట్టి నేవీ చీఫ్ గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు